April 17, 2025
SGSTV NEWS
Telangana

కమిషనర్ మారినా పేరు మారలే

*కమిషనర్ మారినా పేరు మారలే..*


*కామారెడ్డి కమిషనర్ ఇంకా దేవేందరుడేనా*


*కొత్త కమిషనర్ వచ్చి ఆరు నెలలు*


*బోర్డులో పేరు మార్చని అధికారులు*


*పాత కమిషనరే ఇంకా కొనసాగుతున్నారా అంటున్న ప్రజలు*


*అధికారిక వెబ్ సైట్ లోనూ మారని పేరు*


*కామారెడ్డి మున్సిపల్ అధికారుల తీరు*





కామారెడ్డి జిల్లా బ్యూరో ఆగస్టు 17 : కామారెడ్డి మున్సిపల్ అధికారుల తీరు ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.అధికారులు మారుతున్నా ఏ అధికారి వచ్చారన్న సమాచారాన్ని బోర్డుపై ఉంచడం లేదు.కామారెడ్డి మున్సిపల్ కొత్త కమిషనర్ గా సుజాత గత ఫిబ్రవరి 15 న బాధ్యతలు చేపట్టారు.అంతకుముందు ఉన్న కమిషనర్ దేవేందర్ ఇక్కడినుంచి బదిలీ అయ్యారు.అయితే కమిషనర్ ఛాంబర్ వద్ద ఏ అధికారి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు బాధ్యతలు నిర్వర్తించారో తెలిపే బోర్డు ఏర్పాటు చేశారు.2012 నుంచి ఇప్పటి వరకు కామారెడ్డి మున్సిపల్ కమిషనర్లుగా పని చేసిన వారి పేర్లు అందులో పొందుపరచాల్సి ఉంటుంది.అయితే గత కమిషనర్ దేవేందర్ 18-05-2020 న కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టి ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో బదిలీపై వెళ్లారు. అయితే గత కమిషనర్ దేవేందర్ పేరు తప్ప కొత్తగా వచ్చిన కమిషనర్ సుజాత పేరును ఇంకా బోర్డులో చేర్చకపోవడం అధికారుల పని తీరుకు అద్దం పడుతోంది.గత కమిషనర్ బాధ్యతలు చేపట్టిన తేదీ తప్ప ఎప్పటివరకు ఇక్కడ పని చేసారు అనేది అందులో చేర్చలేదు.కొత్త కమిషనర్ వచ్చి ఆరు నెలల కావస్తున్నా ఇంకా పాత అధికారే ఉన్నారా అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.మున్సిపల్ కార్యాలయంలో అధికారుల తీరు ఇలా ఉండగా మున్సిపల్ అధికారిక వెబ్ సైట్ లో సైతం కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ గా ఇంకా దేవేందర్ పేరే కనిపిస్తోంది.ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేయాల్సిన అధికారులు మాకెందుకులే అనుకుంటున్నారా లేక మార్చడం మర్చిపోయేంతగా పనుల్లో నిమగ్నమయ్యారా అని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఇకనైనా కార్యాలయంతో పాటు వెబ్ సైట్ లో కొత్త కమిషనర్ పేరు చేరుస్తారా లేదా అనేది చూడాలి.

Also read

Related posts

Share via