December 3, 2024
SGSTV NEWS
CrimeNational

అందమైన భార్య.. కానీ ఆ వీడియోలు చూపిస్తూ



అందమైన భార్య ఉన్నా.. నిత్యం ఆమెతో గొడవలు పడేవాడు శ్రీహరి. భార్య ముందే మరో అమ్మాయితో పరాచకాలు ఆడుతుండేవాడు. ఇతర మహిళలతోె ఉన్నప్పుడు వీడియో కాల్స్ చేసి..



జీవితాంతం భార్యకు అండగా ఉంటానని, ఆమె కష్ట నష్టాల్లో తోడునీడగా నిలుస్తానని ప్రమాణం చేసే భర్త.. పట్టుమని ఐదేళ్ల కూడా సఖ్యతగా మెలగడం లేదు. వంకర చూపులు చూస్తూ భార్యను మానసికంగానూ, శారీరంకంగానూ హింసకు గురి చేస్తున్నాడు. పరాయి స్త్రీ కోసం కట్టుకున్న దాన్ని సూటిపోటీ మాటలతో ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాడు. చివరకు ఆమె చేతులతోనే.. ఆమె ప్రాణాలు తీసుకునేలా పురిగొల్పుతున్నాడు. భార్యను హింసించి.. తన చేతులతో తానే ఆత్మహత్య చేసుకునేలా చేశాడు భర్త. ఆమె చనిపోతుంటే.. కనీసం ఆపేందుకు కూడా ప్రయత్నం చేయలేదు. చివరకు అగ్నికి ఆహుతయ్యింది. బిడ్డను అనాథ చేసి మృత్యు ఒడికి చేరింది. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరుకు దక్షిణంగా ఉన్న బొమ్మన హళ్లిలో చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. బొమ్మన హళ్లి మండలంలోని హుళిమావు సమీపంలో అక్షయనగర్‌లో నివసిస్తున్నారు భార్యా భర్తలు శ్రీహరి, అనూష. వీరికి ఐదేళ్ల క్రితమే వివాహం అయ్యింది. వీరికి ఓ ముద్దుల కొడుకు కూడా ఉన్నాడు. అయితే ఇటీవల భర్త ఆమెను పట్టించుకోవడం మానేశాడు. అంతేకాకుండా పరాయి స్త్రీలతో అక్రమ సంబంధాన్ని పెట్టుకోవడంతో భర్తను నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ విషయంపై మనస్థాపం చెందిన అనూష బాత్‌రూమ్‌లో పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుంది. తను చనిపోయేటప్పుడు వీడియో కాల్ చేసి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. అనంతరం పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది.. కుటుంబ సభ్యులు గమనించి.. హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించింది.

అనూష తల్లీదండ్రులు చెబుతున్న వివరాల ప్రకారం. తన కూతుర్ని అల్లుడు హేమంత్ మూడు నెలల నుండి హింసిస్తున్నాడు. మొబైల్ ఫోన్‌లో అసభ్యకర వీడియోలు చూపించి తనతో అలా ఉండాలంటూ చిత్రహింసలకు గురి చేసేవాడు. అంతే కాకుండా భార్య ఎదుటే ఇతర అమ్మాయిలతో సాన్నిహిత్యంగా మెలిగేవాడు. ఏంటని ప్రశ్నిస్తే విడాకులు ఇవ్వాలంటూ హింసకు గురి చేసేవాడు. హీరో దర్శన్ రెండో పెళ్లి చేసుకుని ఆనందంగా లేడా..? నేను కూడా రెండో పెళ్లి చేసుకుంటాను.. అందులో తప్పేంటని ప్రశ్నించాడు.  ఆఫీస్‌లో టీమ్ లీడర్‌గా ఉండేవాడు. మిస్ బిహేవ్ అది తీసేశారు.  దీంతో మరిన్ని వేధింపులు ఎక్కువయ్యాయి. ఆమె చనిపోయేటప్పుడు కూడా భర్త బెడ్రూమ్‌లోనే ఉన్నాడని, అనూష ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఆపలేదని చెప్పారు. తన కూతురు జీవితాన్ని నాశనం చేశాడంటూ కన్నీరు మున్నీరు అయ్యారు ఆమె పేరెంట్స్ . అనూష మరణంతో రెండేళ్ల కొడుకు అనాధయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేశారు అనూష తండ్రి హేమంత్. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts

Share via