SGSTV NEWS online
Andhra PradeshCrime

బిసి వసతి గృహం విద్యార్థి మృతి

విజయనగరం : విజయనగరంలోని కాటవీధి బీసీ హాస్టల్ కు చెందిన విద్యార్థి కొణతాల శ్యామలరావు ఆదివారం మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం చిల్లపేటరాజం గ్రామానికి చెందిన శ్యామల రావు ఉదయం కళ్ళు తిరుగుతున్నాయని పడిపోవడంతో హాస్టల్ వార్డెన్ జానకిరామ్ జిల్లా సర్వజనాస్పత్రికి తరలించారు. ఆసుపత్రి వైద్యులు తనిఖీ చేసి విద్యార్థి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆస్పత్రి వైద్యులు మాత్రం మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని, స్థానిక పోలీసులకు సమాచారం అందించినట్లు చెప్పారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. విద్యార్ది చనిపోవడం చూసి బోరున విలపిస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న సంక్షేమ శాఖ అధికారి యశోధనరావు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. వార్డెన్ తో మాట్లాడి ఎలా జరిగిందో ఆరా తీశారు. వెంటనే జిల్లా కలెక్టరుకి, పోలీస్ వారికి సమాచారం అందించారు.

Also read

Related posts