• తల్లికి ఇన్స్టాలో మెసేజ్ చేసి కూతురు అదృశ్యంబంజారాహిల్స్: తాను స్నేహితురాలితో వెళ్తున్నానని, తన కోసం
వెతకవద్దని ఇన్సాగ్రామ్లో తల్లికి పోస్ట్ పెట్టిన ఓ బాలిక సాయంత్రం తాను ముంబైలో ఉన్నానని, సైఫ్ అనే యువకుడిని పెళ్లి చేసుకున్నట్లు మరో పోస్ట్ చేసింది. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు… బంజారాహిల్స్ రోడ్డు నెంబర్-11లోని ఉదయ్నగర్లో నివసించే బాలిక (14) ఎనిమిదో తరగతి పూర్తి చేసింది. ఇన్సాగ్రామ్లో చురుగ్గా ఉంటుంది. సోషల్ మీడియాను బాగా ఫాలో అవుతుంది. ఇందులో భాగంగానే ఇన్స్టాలో జహ్రనగర్లో సైఫ్ అనే యువకుడు పరిచయం అయ్యాడు.
ఈ నెల 17వ తేదీన తన తల్లికి ఆ బాలిక తన స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నానంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఈ నెల 22న ఆ బాలిక ఇన్స్టాలోనే తాను సైఫ్ను పెళ్లి చేసుకున్నానని, ముంబయిలో ఉన్నానని, ఇద్దరూ కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది. కొంతకాలంగా తన కూతురు జహ్రనగర్కు వెళ్తుండేదని, సైఫ్ అనే యువకుడు ఇన్స్టాలో పరిచయం అయ్యాడని, ఆయనతో వెళ్లిన విషయాన్ని ఇన్స్టాలో పోస్ట్ చేసి చెప్పిందని బాధిత తల్లి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also read
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో