Bandi Sanjay: స్వేచ్ఛ బ్యూరో: బండి భగీరథ
ఇష్యూలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకున్నట్లుగా పరిస్థితి మారిందా? భగీరథ ఇష్ యూలో ఆయనకు ఇతరులు ఇచ్చిన సలహాలే ఆయన కొంపముంచాయా? ఆయన వెంట ఉండే కోటరీ సూచనలే.. సంజయ్ ని మరింత పీకల్లోతుల్లో కూరుకుపోయేలా చేశాయా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. కార్పొరేటర్ స్థాయి నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన బండి సంజయ్.. ఎంపీగా, ఒక జాతీయ పార్టీ(బీజేపీ)కి రాష్ట్ర అధ్యక్షుడిగా, ఆపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా అతి తక్కువ సమయంలోనే అంచెలంచెలుగా ఎదిగారు.
వివాదంలో వాస్తవాలేంటో..
ఈ అధికార హోదా ఆయనకు అంత ఈజీగా రాలేదు. పొలిటికల్ గా ఎన్నో సవాళ్లు, ఇబ్బందులను ఆయన అడుగడుగునా ఎదుర్కొన్నారు. ఎన్నో కష్టాలు పడి చివరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి స్థాయికి ఎదిగారు. కానీ ఒక్క ఇష్యూ ఆయన పొలిటికల్ కెరీర్ కు మాయని మచ్చగా మిగిలిపోయింది. భగీరథ ఇరుక్కున్న వివాదంలో వాస్తవాలేంటో తెలుసుకుని ఆయన్ను ముందుగానే పోలీసులకు అప్పజెప్పి ఉంటే కేంద్ర మంత్రిగా బండి సంజయ్ హోదాకు హూందాగా ఉండేదనే చర్చ జరుగుతోంది.
పీకల్లోతు ఇరకాటం..
భగీరథపై నమోదైన పోక్సో కేసు కారణంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాజకీయ ప్రస్థానంలో ఊహించని వివాదం ఆయన ఇమేజ్ను తీవ్రంగా దెబ్బతీసిందని చెప్పుకుంటున్నారు. భగీరథకు సంబంధించిన వివాదం ఆయన్ను పీకల్లోతు ఇరకాటంలోకి నెట్టాయి. స్వయంగా కేంద్ర మంత్రి నివాసంలోనే భగీరథ కోసం సోదాలు నిర్వహించే పరిస్థితికి వెళ్లడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది.
వాళ్లే కొంప ముంచారా..
ఈ మొత్తం వ్యవహారంలో బండి సంజయ్ చుట్టూ ఉన్న కోటరీ, ఆయనకు సలహాలు ఇచ్చే వాళ్లే కొంప ముంచారనే టాక్ బలంగా వినిపిస్తోంది. సమస్య మొదలైనప్పుడే చట్టపరంగా, హుందాగా స్పందించి ఉంటే వివాదం ఇంత దూరం వచ్చేది కాదని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చించుకుంటున్నారు. కానీ, చుట్టూ ఉన్నోళ్లు ఇచ్చిన తప్పుడు సూచనలు, అతి ఉత్సాహం కారణంగానే ఈ ఇష్యూ మరింత జటిలమైందని ప్రచారం జరుగుతోంది. వారి మాటలు నమ్మి తీసుకున్న నిర్ణయాలే సంజయ్‌ను ఇరకాటంలో పడేలా చేశాయని అనుకుంటున్నారు.
అన్ని వర్గాల్లో దూకుడు..
భగీరథ కేసుకు సంబంధించి ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరవ్వకపోవడంతో పోలీసులు లుక్ ఔట్ నోటీసులు ఇచ్చారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నివాసంలో భగీరథ కోసం సోదాలు జరగడం అనేది అన్ని వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా దూకుడుగా ఉంటూ, ప్రత్యర్థులపై విరుచుకుపడే బండి సంజయ్.. ఇప్పుడు తన సొంత ఇంట్లోనే జరిగిన పరిణామాలకు డిఫెన్స్‌లో పడిపోయారు. ఈ వ్యవహారం ఆయన రాజకీయ ఇమేజ్‌కు పెద్ద మైనస్ గా మారిందని చర్చించుకుంటున్నారు.
భవిష్యత్‌లో..
ఈ వివాదానికి కారణమైన అంశాలను లేదా వ్యక్తులను ముందే చట్టానికి అప్పగించి, చట్టపరమైన విచారణకు సహకరించి ఉంటే బండి సంజయ్ హోదాకు మరింత హుందాగా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముందే అలా చేసి ఉంటే ఆయన రాజకీయ నైతికత పెరిగేదని, కానీ, అలా చేయకపోవడం వల్లే ఇప్పుడు కేంద్ర మంత్రి పదవిలో ఉండి కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా.. భగీరథ ఇష్యూలో చుట్టూ ఉన్నోళ్ల తప్పుడు గైడెన్స్ వల్ల బండి సంజయ్ కెరీర్లో ఇదొక మాయని మచ్చగా మిగిలిపోయింది. భవిష్యత్ లో ఎలాంటి పరిణామాలకు ఇది దారితీస్తుందనేది చూడాలి.
Also read
- షాపులు, బేకరీల్లో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. చివరికి షాకింగ్ ట్విస్ట్!
- బండి సంజయ్ కొంపముంచిన సొంత ముఠా.. భగీరథ కేసులో అసలు గుట్టు ఇదే!
- అధిక జ్యేష్ఠ మాసం.. ఈ ప్రత్యేక తిథుల్లో పొరపాటున కూడా చేయకూడని పనులు!
- అద్భుతం! ఈ ఆలయంలో నీటితో దీపం వెలుగుతుందా? నిజం ఏంటి తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





