SGSTV NEWS
CrimeTelangana

నవ వధువు ఆత్మహత్య



బాలానగర్‌ (తెలంగాణ) : నవవధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన బాలానగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం జరిగింది. ఎపి రాష్ట్రం విజయనగరం జిల్లా, తర్లా మండలం నందిగామకు చెందిన ఈశ్వరరావుతో గత ఫిబ్రవరి 6వ తేదీన గంటా విజయ గౌరీ (23) కి వివాహం జరిగింది. నూతన దంపతులు తెలంగాణ రాష్ట్రం బాలానగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బాల్‌ రెడ్డి నగర్‌లో నివాసముంటున్నారు. ఈశ్వరరావు డ్యూటీకి వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చేసరికి విజయగౌరి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాలానగర్‌ ఇన్‌స్పెక్టర్‌ టి.నరసింహరాజు తెలిపారు

Also read

Related posts

Share this