November 21, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024CrimePolitical

Chittor: మంత్రి పెద్దిరెడ్డి అనుచరుల ఘాతుకం.. బీసీవైపీ అధ్యక్షుడిపై దాడికి యత్నం

చిత్తూరు జిల్లా సదుం పోలీస్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీసీవైపీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్పై వైకాపా నేతలు దాడికి యత్నించారు.

సదుం: చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు ఘాతుకానికి పాల్పడ్డారు. భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధ్యక్షుడు  రామచంద్ర యాదవ్పై దాడికి యత్నించారు. దీంతో సదుం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.  సదుం మండలం ఎర్రాతివారిపల్లెలో ప్రచారం నిర్వహించేందుకు రామచంద్రయాదవ్ వెళ్లారు. మంత్రి  పెద్దిరెడ్డి స్వగ్రామంలో బీసీవైపీ ప్రచారం నిర్వహించడంపై
పెద్దిరెడ్డి బంధువు వేణుగోపాల్రెడ్డి అభ్యంతరం
తెలిపారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం  చోటు చేసుకుంది. ఏదో రకంగా ప్రచారం ముగించుకొని  రామచంద్రయాదవ్ వెనక్కి వచ్చేశారు. మరో గ్రామంలో  ప్రచారం చేస్తుండగా పెద్దిరెడ్డి వర్గీయులు  రామచంద్రయాదవ్ పై దాడికి యత్నించారు. పోలీసులు జోక్యం చేసుకొని ఆయన్ను సదుం పోలీస్ స్టేషన్ కు  తరలించారు. అక్కడికి చేరుకున్న వైకాపా నాయకులు వీరంగం సృష్టించారు. వారి వాహనాలను ధ్వంసం చేశారు. కాన్వాజ్లోని వాహనాలకు నిప్పు పెట్టారు.
పోలీస్ స్టేషన్ పైనా దాడికి యత్నించారు. ఈ క్రమంలో  పోలీస్ స్టేషన్ వద్దకు వైకాపా కార్యకర్తలు భారీగా  చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

రెండు రోజుల క్రితం పుంగనూరు మండలంలోని మాగాండ్లపల్లెలోనూ బీసీవైపీకి ఇదే తరహా అనుభవం ఎదురైంది. రామచంద్రయాదవ్ ప్రచారం నిర్వహిస్తుండగా.. గ్రామంలోని వైకాపా కార్యకర్త శశిభూషణ్డ్డికి కరపత్రం అందజేసే సమయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. మాటమాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఇరువర్గాలు కర్రలు, రాళ్లతో దాడులకు పాల్పడ్డాయి. దాడిలో బీసీవైపీకి చెందిన ఓ వాహనం అద్దాలు పగిలిపోయాయి. ఆ పార్టీ కార్యకర్త నారాయణ గాయపడ్డారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. గాయపడ్డ నారాయణను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Also read

Related posts

Share via