April 11, 2025
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024Astrology

Allagadda: మాజీ మంత్రి అఖిలప్రియ బాడీగార్డ్ప హత్యాయత్నం

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్ పై హత్యాయత్నం జరిగింది.

ఆళ్లగడ్డ : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిలైపై హత్యాయత్నం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటుచేసుకుంది. అఖిలప్రియ ఇంటి ముందు నిఖిల్ నిలుచుని ఉండగా.. కారుతో దుండగులు ఆయన్ను ఢీకొట్టారు. అనంతరం ముగ్గురు వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేశారు. నిఖిల్ వారి నుంచి తప్పించుకుని అఖిలప్రియ ఇంట్లోకి వెళ్లిపోయారు. తీవ్రగాయాలతో ఉన్న అతడిని నంద్యాలలోని ఆస్పత్రికి తరలించారు.

గతంలో నంద్యాలలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర సమయంలో తెదేపా నేత ఏవీ సుబ్బారెడ్డిపై నిఖిల్ దాడి చేశాడు. ఈ నేపథ్యంలోనే ఆయన వర్గీయులు తిరిగి దాడికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనతో నేతల ఇళ్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏవీ సుబ్బారెడ్డి, చంద్రతో పాటు మరో నలుగురిపై ఆళ్లగడ్డ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

Also read

Related posts

Share via