Tirupati YCP leader: తిరుపతిలో వైసీపీ లీడర్ ఒకర్ని ఓ వ్యక్తి నడిరోడ్డుపై చెప్పుతో కొట్టాడు. అతని కారును ధ్వంసం చేశాడు. కానీ ఆ లీడర్ మాత్రం ఎదురుదాడి చేయలేదు. ఎందుకో తెలుసా?
Tirupati YCP leader attacked : వైఎస్ఆర్సీపీలో పబ్లిసిటీ వింగ్ బాధ్యతలు చూసే నేత, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తనపై జరిగిన దాడితో అనూహ్యమైన నెగటివ్ పబ్లిసిటీ ని మూటగట్టుకున్నారు. పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడు, వైసీపీ పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ రెడ్డిపై తిరుపతి సమీపంలోని ఉప్పరపల్లి వద్ద సినిమా ఫక్కీలో దాడి జరిగింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో సాక్షాత్తూ ఒక సర్పంచ్, తన భార్యతో కలిసి ఉన్న హరిప్రసాద్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం సంచలనంగా మారింది.
నడిరోడ్డుపై హైడ్రామా– అడ్డగించి.. బయటకు లాగి..!
హరిప్రసాద్ రెడ్డి ఒక మహిళతో కలిసి కారులో వెళ్తుండగా, తిరుపతి జిల్లాలోని ఒక గ్రామ వైసీపీ సర్పంచ్ అయినా ఆమె భర్త వారిని వెంబడించారు. ఉప్పరపల్లి వద్ద కారును అడ్డగించి, లోపల ఉన్న హరిప్రసాద్ రెడ్డిని, తన భార్యను బయటకు ఈడ్చుకొచ్చారు. ఆగ్రహంతో ఊగిపోయిన సర్పంచ్, అందరూ చూస్తుండగానే హరిప్రసాద్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. చెప్పుతో కొడుతూ, నిలదీస్తుంటే హరిప్రసాద్ రెడ్డి కనీసం ఎదురు చెప్పలేని స్థితిలో మౌనంగా ఉండిపోవడం అక్కడు వున్న వారిని ఆశ్చర్యపరిచింది.
ధ్వంసమైన కారు.. మౌనంగా వెనుదిరిగిన నేత
దాడి అక్కడితో ఆగలేదు. సదరు సర్పంచ్ హరిప్రసాద్ రెడ్డి కారును ధ్వంసం చేశారు. అనంతరం తన భార్యను బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లారు. పార్టీలో కీలక పదవిలో ఉండి, సొంత పార్టీ సర్పంచ్ భార్యతోనే ఇలాంటి సంబంధం పెట్టుకోవడంపై స్థానికంగా చర్చలు మొదలయ్యాయి. అయితే, ఈ ఘటనపై పరువు పోతుందన్న భయంతోనో ఏమో కానీ, హరిప్రసాద్ రెడ్డి ఇప్పటివరకు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ హైడ్రామాకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ వివాదంపై ఇంకా వైసీపీ పార్టీ స్పందించలేదు. వ్యక్తిగత అంశం కావడంతో అది పార్టీకి సంబంధం లేని అంశంగా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇతర పార్టీల నేతలు ఇలాంటి విషయాల్లో బయటపడితే తీవ్ర ఆరోపణలు చేస్తారు కాబట్టి ఇతర పార్టీలు అంటే టీడీపీ, జనసేన పార్టీలు కూడా వైసీపీపై హరిప్రసాద్ రెడ్డి విషయంలో తీవ్రంగా స్పందిస్తున్నాయి.
Also read
- శ్రీశైలం డ్యామ్ వద్ద ఘోరం.. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ను వెంటాడి చంపేశారు..! హంతకులు ఎవరంటే?
- ప్రియుడి మోజులో పడి భర్తను ఏం చేసిందంటే..
- విజయవాడ ఉగ్ర లింకుల కేసు.. విస్తుపోయే నిజాలు.. హైదరాబాద్లో ఒకరి అరెస్ట్
- ఎంత పని చేశావ్ ఇషికా.. ప్రియుడితో కలిసి కన్నతల్లిని నట్టింట్లోనే..
- ‘నాకు అమ్మా నాన్న లేరు సార్.. మీరే నాకు అమ్మా నాన్న! పాస్ చేయండి సార్..’





