శ్రీకాకుళం జిల్లా పలాసలో వైకాపా అల్లరిమూకలు రెచ్చిపోయాయి. రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు ప్రోద్బలంతో నియోజకవర్గంలో ఎక్కడికక్కడ తెదేపా కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు
మంత్రి అప్పలరాజు ప్రోద్బలంతో ఘాతుకం
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పలాసలో వైకాపా అల్లరిమూకలు రెచ్చిపోయాయి. రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు ప్రోద్బలంతో నియోజకవర్గంలో ఎక్కడికక్కడ తెదేపా కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. పలాస మండలం అమలకుడియా గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త బూర్జి అప్పలస్వామి పోలింగ్కు ముందు రోజు కాలనీ నుంచి వస్తుండగా.. వైకాపాకు చెందిన టి.వినోద్ ఎదురుపడి ఫ్యాన్ చాలా వేగంగా తిరుగుతోందని వ్యాఖ్యానించాడు. అప్పలస్వామి ప్రతిస్పందిస్తూ రోడ్డుపై సైకిల్ చాలా స్పీడుగా వెళ్తాందన్నారు. దీంతో ఆగ్రహానికి గురైన వినోద్ ‘నీ స్పీడు సంగతి తర్వాత చూస్తాం’ అంటూ వెళ్లిపోయాడు. సోమవారం అర్ధరాత్రి దాటాక అప్పలస్వామి బహిర్భూమికి వెళ్తుండగా ఆయన తలపై క్రికెట్ స్టంప్తో దాడి చేశారు.
బాధితుడిని కుటుంబ సభ్యులు పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు 23 కుట్లు వేశారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025