February 3, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Attack on SI : దారుణం – మానవత్వం చూపిన ఎస్ఐపై పోలీస్ స్టేషన్ లోనే దాడి

Attack on SI : శాంతి భద్రతలను పరిరక్షించే పోలీసుపై దాడి జరిగింది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని రూరల్ స్టేషన్ ఎస్ఐ మహమ్మద్ రఫీపై దాడి కలకలం రేపుతోంది.
వైఎస్సార్ జిల్లాకి చెందిన ఓ ఇద్దరు వ్యక్తులు వెళ్తుండగా ఓ కారు ఢీకొట్టింది. పోలీసులు వెంటనే కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చారు. అయితే యాక్సిడెంట్‌కి కారణమైన వారిని ఎస్‌ఐ వదిలేశాడని గాయపడిన వారి కుటుంబ సభ్యులు అతనిపై దాడికి పాల్పడ్డారు.

పోలీస్ స్టేషన్‌లోనే ఎస్‌ఐపై దాడికి పాల్పడిన ఘటన వైఎస్సార్ జిల్లాలో చోటుచేసుకుంది. ప్రొద్దుటూరు గ్రామీణ ఠాణాలోని మఫ్టీలో ఉన్న ఎస్‌ఐ మహమ్మద్‌ రఫీపై అతని బంధువులు చేయి చేసుకున్నారు. రాజుపాళేనికి చెందిన చిన్న లింగమయ్య, హర్ష అనే ఇద్దరు యువకులు బైక్‌పై బైపాస్ దాటుతున్నారు. ఈ సమయంలో ఓ కారు వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వీరిద్దరూ గాయపడటంతో అక్కడ ఉన్న ఎస్‌ఐ మహమ్మద్‌ రఫీ వారిని ఆసుపత్రికి తరలించారు.


యాక్సిడెంట్‌ చేసిన వారిని ఎలా వదిలేస్తారని..
కారు డ్రైవర్‌ వెంకటరెడ్డిని ఠాణాకు తీసుకువెళ్లి కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చారు. అయితే గాయపడిన వారి బంధువులు కోపంతో ప్రమాదానికి కారణమైన కారును ధ్వంసం చేసి.. స్టేషన్‌కు వెళ్లి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. యాక్సిడెంట్ చేసిన వారిని ఎలా వదిలేస్తారని పోలీసులను ప్రశ్నించారు. చిన్న లింగమయ్య సోదరుడు లింగమయ్య మహమ్మద్ రఫీపై దాడి చేశారు. దీంతో లింగమయ్యతో పాటు మరో ఆరుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Also Read

Related posts

Share via