November 21, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

దేవాదాయ  అర్చకులపై దాడి చేసిన : అధికార పార్టీ మాజీ కార్పొరేటర్ చంద్రరావు

.. నిమిషాల వ్యవధిలో స్పందించిన కమిషనర్

..పట్టించుకోని డీ ఈ ఓ కాకినాడ: ఓ మాజీ కార్పొరేటర్ అర్చకులపై వీరంగం సృష్టించాడు. కాళ్లతో తన్ని బండబూతులు  తిట్టి రెచ్చిపోయాడు. ఈ సమాచారం తెలుసుకున్న కమిషనర్ ఐదు నిమిషాల వ్యవధిలోనే స్పందించారు. కానీ జిల్లా ఎండోమెంట్ ఆఫీసర్ పట్టించుకోలేదు. దీంతో పోలీసులు కూడా సంబంధంలేని సెక్షన్ పెట్టి చేతులు దులిపేసుకున్నారు. కాకినాడ దేవాలయం వీధిలోని పెద్ద శివాలయంలో సహాయ అర్చకునిగా సాయి పని చేస్తున్నారు. పక్కనే ఉపాలయం లో మరో అర్చకులు విజయ కుమార్ పనిచేస్తున్నారు. ఇదిలా ఉంటే సోమవారం పౌర్ణమి కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసారు. అదే సమయంలో మాజీ కార్పొరేటర్ సిరియాల చందర్రావు ఆలయానికి వచ్చారు. స్వామివారికి కొబ్బరికాయ, పాలు తీసుకువచ్చారు. ఆలయం లోపల లింగంపై ఆ పాలు అర్చకులు పోసారు .ఈ లోగా చంద్రరావు లింగం పై పాలు పడడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్చకుడు సాయి బదులిస్తూనే ప్రసాదం ఇస్తాను ఉండండి అన్నారు.

నాకు ఎదురు చెబుతావా అంటూ అక్కడే అంతరాలయంలోనే అర్చకుడిని చాచి లెంపకాయ కొట్టాడు. ఇదేమిటి అని ప్రశ్నిస్తే బయటికి తీసుకొచ్చి కాలితో తన్నాడు. దీనిని అడ్డుకునేందుకు  ప్రయత్నించిన మరో అర్చకుడు విజయ్ కుమార్ ని కూడా చెంపపై కొట్టాడు. బండ బూతులు తిడుతూ మీ అంతు చూస్తానంటూ వీరంగం సృష్టించాడు. ఇక్కడే అధికారులు తమ కక్కుర్తి బుద్ధి చాటుకున్నారు. ఎక్కడైతే ఘర్షణ జరిగిందో అక్కడ సీసీ కెమెరా పని చేయకుండా నిలిపివేశారు. మొత్తం 16 కెమెరాలు ఉంటే ఐదు కెమెరాలు పనిచేయడం లేదు. గొడవ జరిగిన విషయం దేవాదాయశాఖ రాష్ట్ర కమీషనర్ రాము సత్యనారాయణ , జాయింట్ కమిషనర్ విజయరాజు, జిల్లా ఎండోమెంట్ ఆఫీసర్ పులి నారాయణమూర్తి, కాకినాడ డివిజన్ ఇన్స్పెక్టర్ వడ్డి పనింద్ర కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. జిల్లా ఎండోమెంట్ ఆఫీసర్ గా బాధ్యత తీసుకోవలసిన నారాయణమూర్తి తనకు సంబంధం లేదు. డిప్యూటీ కమిషనర్ తో మాట్లాడుకొండని నిర్లక్ష్యంగా బదులిచ్చారు .ఇన్స్పెక్టర్ ఫనీంద్ర కుమార్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. వివాదం వివరాలు అడిగి తెలుసుకున్నారు. అర్చకునికి రక్షణ చేకూరేలా జరిగిన సంఘటనపై పోలీసు కేసు పెట్టాలని ఆయన ఈవో రాజేశ్వరరావుకు సూచించారు .అర్చకులు నుంచి రాతపూర్వకంగా ఫిర్యాదు తీసుకుని ఈవో రాజేశ్వరరావు కాకినాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కమిషనర్ సత్యనారాయణ రెండుసార్లు ఫోన్ చేసి చర్యలు తీసుకున్నారు లేదా కూడా అడిగారు. కానీ జిల్లా ఎండోమెంట్ ఆఫీసర్ నారాయణమూర్తి ఏమాత్రం పట్టించుకోలేదు. డిప్యూటీ కమిషనర్ విజయరాజు ఈఓతో ఫోన్లో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే వన్ టౌన్ పోలీసులు కూడా ప్రభుత్వ ఉద్యోగిపై దాడి అంటూ కేసు పెట్టారు. అర్చకుడు ప్రభుత్వ ఉద్యోగి కాదు అయినా ఔట్సోర్సింగ్ లో పనిచేస్తున్నారు. దీంతో ఈ కేసు వీగిపోతుందని అర్చక సంఘాలు చెప్తున్నాయి.ఇద్దరు అర్చకులు ప్రభుత్వ ఉద్యోగులు గా రారు.  దీంతో నిందితుడిని కాపాడేందుకు ఒత్తిళ్ళ మేరకు పోలీసులు ఈ సెక్షన్ పెట్టినట్లుగా ఆరోపణ వినిపిస్తున్నాయి. పౌర్ణమి సోమవారం రోజు శివునికి అభిషేకం చేస్తున్న అర్చకులను అదే శివాలయంలో కాళ్లతో తన్ని చెంప దెబ్బలు కొట్టి బండబూతులు తిట్టిన మాజీ కార్పొరేటర్ ను రక్షించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇక్కడ జరిగిన వ్యవహారాన్ని భక్తులు తీవ్రంగా ఖండించారు. గొడవ జరిగిన చోట సీసీ కెమెరా ఎందుకు పనిచేయలేదు చెప్పాలంటూ నిలదీశారు. అయినా దేవాదాయ శాఖ అధికారుల నుంచి స్పందన లేదు. ఈ సమాచారం తెలిసిన వెంటనే దేవాదాయ శాఖ రాష్ట్ర సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్, అఖిలభారత బ్రాహ్మణ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు ద్రోణంరాజు రవికుమార్, ఆలయ దర్శని ఎడిటర్ లక్ష్మణరావు తదితరులు స్పందించారు. అర్చకులు కు న్యాయం జరగకపోతే నేరుగా రంగంలోకి దిగుతామన్నారు. రవికుమార్ ఏలూరు రేంజ్ డిఐజి ,కాకినాడ డిఎస్పీలతో మాట్లాడారు .ఇంత జరిగినా పోలీసులు మాత్రం సంబంధం లేని కేసు పెట్టడం అర్చక బ్రాహ్మణ సంఘాలను ఆవేదనకు గురిచేస్తుంది.

*అర్చకుల పై జరిగే దాడుల్ని అరికట్టాలి…

కాకినాడ శివాలయంలో పనిచేసే అర్చకులు సాయి శర్మ, విజయ్ కుమార్ శర్మల పై నేడు ఫాల్గుణ పౌర్ణమి నాడు గర్భగుడి వద్ద జరిగిన భౌతిక దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం…!!

స్థానిక అర్చకులను కాళ్ళతో ఎగిరి ఎగిరి తన్ని భౌతిక దాడి చేసిన వైసిపి మాజీ కార్పొరేటర్ సిరియాల చంద్రశేఖర్ పై కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేసే వరకు, నిందితుడికి మద్దత్తు ఇస్తున్న ఆలయ ఈఓ,కాకినాడ డిసి లపై చర్యలు తీసుకునే వరకు రాష్ట్ర అర్చక,పురోహిత,బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేద్దాం…!!! సమాజానికి బ్రాహ్మణ ఐక్యతను  తెలియజేద్దాం…
🙏🙏🙏🙏🙏

సిరిపురపు శ్రీధర్ శర్మ
*బ్రాహ్మణ చైతన్య వేదిక*

Also read

Related posts

Share via