SGSTV NEWS
Andhra PradeshCrime

పొలాలు కొలిపిస్తావా అంటూ.. వైకాపా నాయకుల దాడి



మండల పరిధిలోని నాయుడుపాళెంకు చెందిన తెదేపా సీనియర్ నాయకుడు బండ్ల సురేంద్రపై స్థానిక వైకాపా నాయకులు దాడులు చేయడంతో తీవ్రగాయాలయ్యాయి.


కొడవలూరు: మండల పరిధిలోని నాయుడుపాళెంకు చెందిన తెదేపా సీనియర్ నాయకుడు బండ్ల సురేంద్రపై స్థానిక వైకాపా నాయకులు దాడులు చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల కథనం మేరకు… తెదేపా సీనియర్ నాయకులు బండ్ల సురేంద్ర గురువారం సాయంత్రం కొడవలూరు తహసీల్దారు కార్యాలయం నుంచి ఇంటికి వెళుతున్నారు. నాయుడుపాళెం వద్ద జాతీయ రహదారిపై కాపు కాసిన మోహన్, జనార్దన్, మల్లికార్జున, తదితరులు మూకుమ్మడిగా దాడులు చేశారు. మా పొలాలు కొలిపిస్తావా అని దుర్భాషలాడారు. స్థానికులు 108కు ఫోన్ చేయగా కోవూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. మెరుగైన చికిత్సకోసం నెల్లూరుకు తరలించారు. సీఐ కోటిరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Also read

Related posts