మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రంలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. కూరగాయల మార్కెట్ వద్ద ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవను ఆపేందుకు వెళ్లిన మహిళపై ఓ వ్యక్తి దాడికి తెగబడ్డాడు. నెయిల్ కట్టర్‌తో ఆమె గొంతు కోశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసుల వివరాల ప్రకారం… మహబూబ్‌నగర్ జిల్లాలోని స్థానిక మార్కెట్ వద్ద పరిచయస్తులైన ఓ మహిళ, పురుషుడి మధ్య వాగ్వాదం జరుగుతుండటంతో.. గొడవను ఆపేందుకు వెంకటమ్మ అక్కడికి వెళ్లింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన వ్యక్తి నెయిల్ కట్టర్‌తో ఆమె గొంతుపై దాడి చేశాడు. దాంతో బాధితురాలు తీవ్రంగా గాయపడింది.
అయితే, గాయపడిన వెంకటమ్మను స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు దాడికి పాల్పడిన వ్యక్తిని పట్టుకున్న స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
Also read
- కార్తీక మాసంలో శివపార్వతుల శాంతి కళ్యాణం*
భద్రాచలం, నవంబరు 29: - ఏపీలో కొత్తగా ఏర్పడే 88 అసెంబ్లీ సీట్లు- జిల్లాల వారీగా ప్రతిపాదనలు.
- Baba Fasiuddin: హత్య ప్లాన్.. భగ్నం చేసిన బోరబండ పోలీసులు
- పెళ్లికి అడ్డు వస్తోందని ప్రియురాలి హత్య
- ర్యాపిడో డ్రైవర్ కాళ్లు విరగ్గొట్టారు..





