హైదరాబాద్ నగరంలోని బోరబండ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం వెలుగు చూసింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై జీహెచ్ఏంసీ పారిశుద్ధ్య కార్మికురాలు విధులు నిర్వహిస్తుండగా అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. నిన్న (శుక్రవారం) తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకొంది
పోలీసులు ఎన్నిరకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ మహిళలపట్ల అఘాయిత్యాలు ఆగడం లేదు. తాము పనిచేసే స్థలాల్లో, బయటకు వెళ్లిన సమయంలో, జనసంచారం ఉన్న ప్రాంతాల్లో ఎక్కడైన వారికి వేధింపులు తప్పడం లేదు. ఈ మధ్యకాలంలోనైతే పూర్తిగా మహిళలకు రక్షణ లేకుండాపోయింది. ప్రతీరోజు ఏదో ఒక చోట వారిపై లైంగికదాడులు, హత్యా ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు వయసుతో సబంధం లేకుండా కామాంధుల చేతుల్లో మహిళలు బలవుతున్నారు. తాగిన మత్తులో కొంతమంది, గంజాయి సేవించి మరికొందరు నీచులు అత్యాచారం చేయడంతో పాటు మహిళలను దారుణంగా చంపేస్తున్నారు. మహిళలు ఒంటరిగా కనబడితే చాలు తమ కామవాంఛను తీర్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న పారిశుద్ధ్య కార్మికురాలిపై లైంగిక దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ నగరంలోని బోరబండ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ దారుణం వెలుగు చూసింది. . ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై జీహెచ్ఏంసీ పారిశుద్ధ్య కార్మికురాలు విధులు నిర్వహిస్తుండగా అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. నిన్న (శుక్రవారం) తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈరోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రతీరోజు లాగే బాధితురాలు తన విధులను నిర్వహించేందుకు ఎర్రగడ్డకు వెళ్లింది. తనకు కేటాయించిన పని స్థలంలో విధులు నిర్వహిస్తుండగా ఉన్నట్టుండి ఓ వ్యక్తి ఆమెను బలవంతం చేశాడు.
ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై చెత్తను ఊడుస్తుండగా అక్కడే మాటేసిన రాజు అనే వ్యక్తి కార్మికురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దారుణ ఘటనపై బాధిత మహిళ బోరబండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు రాజును అదుపులోకి తీసుకున్నారు. మద్యం సేవించి ఉన్న రాజు ఆ మత్తులో పారిశుధ్య కార్మికురాలిపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు మోడల్ కాలనీలో ఓ అపార్టెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు.
Also read
- Telangana: ప్రేమించానన్నాడు.. శారీరికంగా కలిశాడు.. కట్ చేస్తే.. పిల్లాడు పుట్టేసరికి
- ఇదేం పోయేకాలం రా.. ఇంట్లో పూజ చేసుకుంటున్న మహిళపై..!
- Garbarakshambigai: మహిళామూర్తులకు సుఖ ప్రసవం చేసేందుకు సాక్షాత్తు జగన్మాత వెలిసిన క్షేత్రం-‘గర్భరక్షాంబిక ఆలయం’, తిరుకరుకావుర్
- నేటి జాతకములు…3 నవంబర్, 2025
- వికారాబాద్లో దారుణం.. వదిన, భార్య, పిల్లలను కొడవలితో నరికి చంపి, ఆపై భర్త సూసైడ్!





