తప్పు చేస్తే తల్లిలా సర్ధిచెప్పాల్సిన లెక్చరర్లు రాక్షసుల్లా ప్రవర్తించారు. క్రమశిక్షణ పేరుతో విద్యార్థినిని తీవ్ర పదజాలంతో నిందించారు. తోటి విద్యార్థుల ముందే తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడంతో మనస్థాపంతో ఓ విద్యార్థిని మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది.
తప్పు చేస్తే తల్లిలా సర్ధిచెప్పాల్సిన లెక్చరర్లు రాక్షసుల్లా ప్రవర్తించారు. క్రమశిక్షణ పేరుతో విద్యార్థినిని తీవ్ర పదజాలంతో నిందించారు. తోటి విద్యార్థుల ముందే తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడంతో మనస్థాపంతో ఓ విద్యార్థిని మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటన నగరంలోని మల్కాజ్‌గిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ రోజు చోటుచేసుకుంది.
e
వివరాల్లోకి వెళితే.. మల్కాజ్‌గిరిఎంఆర్ బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వెస్ట్ మారేడుపల్లికి చెందిన విద్యార్థిని వర్షిణి (17) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది గురువారం వర్షిణి కళాశాలకు గంట ఆలస్యంగా వచ్చింది. దీంతో కోపంతో ఫిజిక్స్, ఇంగ్లీష్ లెక్చరర్స్ శ్రీలక్ష్మి, మాధురిలు ఆమెను అందరి ముందు అసభ్యకర పదజాలంతో దూషించారు. ఆమె తనకు నెలసరి రావడం వల్ల ఆలస్యం అయిందని చెప్పినప్పటికీ.. కాలేజీకి ఎందుకు లేటుగా వచ్చావు.. పీరియడ్స్ వచ్చాయా? నాటకాలు ఆడుతున్నావా.. ఏది చూపించు? అంటూ అత్యంత అసభ్యకరంగా, జుగుప్సాకరంగా మాట్లాడినట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థులందరి ముందు లెక్చరర్లు మాట్లాడిన మాటలకు విద్యార్థిని వర్షిణి మానసికంగా కుంగిపోయింది. ఇంటికి వెళ్లి తల్లితో విషయం చెప్పి ఏడ్చింది. అయితే తల్లి ఓదార్చి తర్వాత వెళ్లి మాట్లాడదామని తల్లి కుమార్తెను సముదాయించింది.
కాలేజీలో జరిగిన ఈ అవమానాన్ని తట్టుకోలేక వర్షిణి పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఆ మాటలే గుర్తొచ్చి తీవ్ర మానసిక వేదన అనుభవించింది. ఇంతలోనే విద్యార్థినికి తలనొప్పి రావడంతో స్పృహ తప్పి కింద పడిపోయింది. స్పందించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే మల్కాజిగిరి ఆసుపత్రికి తరలించారు. అనంతరం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ సిటీ స్కాన్ చేయించారు. విద్యార్థిని ఎడమ చేయి, కాలు కూడా పనిచేయడం మానేశాయి. స్కానింగ్ చేసిన వైద్యులు.. తీవ్ర మనస్తాపానికి గురికావడంతో బ్రెయిన్‌లో రక్తం గడ్డ కట్టిందని చెప్పారు. అనంతరం అదే రాత్రి బాలిక మృతి చెందింది.వర్షిణి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. దీంతో శుక్రవారం ఉదయం కళాశాల ముందు ఆమె తల్లిదండ్రులు, ఎమ్మార్పీఎస్ నేతలు, ఓయూ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. వెంటనే సదరు లెక్చరర్స్, ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Also Read
- నేటి జాతకములు..24 జనవరి, 2026
- Crime News: ఎంతకు తెగించార్రా.. ఆ పని తప్పని చెప్పిన పాపానికి.. ఇంతలా వేధిస్తారా?
- దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్ సూసైడ్! ముగ్గురు మృతి
- Crime News: ఎవడు మమ్మీ వీడు.. ప్రేయసి ముక్కు కోసి ఎత్తుకెళ్లిన ప్రియుడు.. ఎందుకో తెలిస్తే
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..





