December 4, 2024
SGSTV NEWS
CrimeTelangana

నా భర్త ఆత్మహత్యకు జ్యోతిష్యుడే కారణం

దొడ్డబళ్లాపురం: వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన నకిలీ జ్యోతిష్యున్ని కనకపుర పోలీసులు అరెస్టు చేసారు. ఫేస్‌బుక్‌లో జ్యోతిష్యునిగా చెప్పుకుని మోసం చేస్తున్న విష్ణు (22) నిందితుడు. విష్ణు బాగలకోటకు చెందినవాడు కాగా బెంగళూరు బసవేశ్వర నగరలో ఒక కాలేజీలో చదువుకుంటున్నాడు. మార్చి 9వ తేదీన ముత్తురాజు అనే వ్యక్తి కనకపుర తాలూకా టీ.బేకుప్పె అర్కావతి వంతెన పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తన భర్త ఆత్మహత్యకు ఒక జ్యోతిష్యుడే కారణమని ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. విచారణలో విష్ణు నికృష్ట స్వరూపం బయటపడింది.

కష్టాలు తీర్చాలని కోరగా
సమస్యల్లో ఉన్న ముత్తురాజు ఫేస్‌బుక్‌లో పరిచయమైన విష్ణుకు కష్టాలు చెప్పుకున్నాడు. ఈ సమస్యలు తీరుస్తానని చెప్పి అతని, అత్త ఫోటోలు పంపాలని కోరగా అలాగే చేశాడు. కొంత డబ్బు కూడా బదిలీ చేశారు. ఎన్నిరోజులైనా విష్ణు నుంచి స్పందన లేదు. దీంతో డబ్బులు వెనక్కి ఇవ్వాలని ముత్తురాజు కోరాడు. దీంతో విష్ణు నీకు, మీ అత్తకు అక్రమ సంబంధం ఉన్నట్టు ప్రచారం చేస్తానంటూ డీప్‌ఫేక్‌ ద్వారా కొన్ని అశ్లీల చిత్రాలను రూపొందించి ముత్తురాజుకు పంపి, డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. మార్చి 9వ తేదీన ముత్తురాజ్‌ టీ.బేకుప్పె వద్ద ఉన్న అర్కావతి వంతెన వద్దకు వెళ్లి విష్ణుకు ఫోన్‌ చేసి తనను బ్లాక్‌మెయిల్‌ చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు. నువ్వు చస్తే నాకేమీ నష్టం లేదు, చావు అని విష్ణు చెప్పడంతో ముత్తురాజు ఆత్మహత్య చేసుకున్నాడు.

Also read

Related posts

Share via