నవ గ్రహాలకు అధినేత.. ప్రత్యక్ష దైవం సూర్యుడు మరో రెండు రోజుల్లో తన రాశిని మార్చుకోబోతున్నాడు. ఈ రోజున సూర్యుడు మేష రాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. జ్యోతిషశాస్త్రంలో సూర్యుని సంచారాన్ని ఒక ముఖ్యమైన సంఘటనగా పరిగణిస్తారు. ఈ సంచారం అన్ని రాశులపై మంచి లేదా చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఈ నేపధ్యంలో సూర్య సంచారంతో నాలుగు రాశుల వారు కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందట. అవి ఏమింటే..
నవ గ్రహాలకు రాజు అయిన సూర్యుడు మేష రాశి నుంచి వృషభ రాశిలోకి అడుగు పెట్టనున్నాడు. దీని కారణంగా మొత్తం రాశులపై మంచి, చెడు ప్రభావాన్ని చూపవచ్చు. కొన్ని రాశులకు అదృష్టాన్ని తీసుకొస్తే.. మరొకొన్ని రాశులకు సూర్య సంచారం కష్టాలు తెస్తుంది. జ్యోతిషశాస్త్ర నమ్మకాల ప్రకారం సూర్యుని ఈ సంచారము 4 రాశులవారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. వ్యక్తిగత జాతకంలో గ్రహాల స్థానాన్ని బట్టి ఈ ప్రభావాలు మారవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు.
పంచాంగం, జ్యోతిషశాస్త్ర గణనల ప్రకారం మే 15, గురువారం సూర్యభగవానుడు రాత్రి 12:11 గంటలకు మేషరాశి నుంచి వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యభగవానుడు వృషభ రాశిలోకి ప్రవేశించే రోజుని వృషభ సంక్రాంతిగా పండుగ జరుపుకుంటారు. ఈ రోజున సూర్యభగవానుడిని పూజించే సంప్రదాయం ఉంది. అలాగే పవిత్ర నదీలో స్నానం, దానాలు చేస్తారు. అయితే ఈ సూర్య సంచారం వలన ఈ 4 రాశులకు చెందిన వ్యక్తులపై చెడు ప్రభావాన్ని చూపించనుందని చెబుతున్నారు. ఆ రాశులు ఏమిటంటే..
👉 వృషభ రాశి: సూర్యుడు ఈ రాశికి వారి లగ్నరాశి నుంచి రెండవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. కఠినత్వం, కుటుంబ విభేదాలు, ఆర్థిక విషయాలలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం కూడా ముఖ్యం.
👉 కర్కాటక రాశి: సూర్యుడు ఈ రాశికి చెందిన వారి జాతకంలో నాల్గవ ఇంటి నుంచి ఐదవ ఇంటికి సంచారము చేస్తాడు. ఈ కాలంలో ఈ రాశికి చెందిన వ్యక్తుల పిల్లల విషయంలో చింత పడాల్సి ఉంటుంది. ప్రేమ సంబంధాలలో ఉద్రిక్తత , విద్యా రంగంలో కొన్ని అడ్డంకులను ఎదుర్కోవాల్సి రావచ్చు.
👉 వృశ్చిక రాశి: సూర్యుడు ఈ రాశికి చెందిన వ్యక్తుల జాతకంలో ఏడవ ఇంటి నుంచి ఎనిమిదవ ఇంటికి సంచారము చేస్తాడు. ఈ సంచారము వీరి ఆరోగ్యానికి మంచిది కాదు. జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడవచ్చు. అత్తమామలతో సంబంధాలలో చికాకులు కలగవచ్చు.
👉 కుంభ రాశి: సూర్యుడు వీటి జన్మ కుండలిలో పదవ ఇంటి నుండి పదకొండవ ఇంటికి సూర్యుడు సంచారము చేస్తాడు. ఈ సమయంలో ఉద్యోగస్తులు ఆఫీసులో కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. సీనియర్ అధికారులతో విభేదాలు ఏర్పడవచ్చు. బదిలీకి కూడా అవకాశం ఉండవచ్చు.
ఏ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలంటే
వ్యక్తిగత జాతకంలో ఇతర గ్రహాల స్థానం .. సూర్య సంచారం వలన ప్రభావాన్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. చెడు ప్రభావం చూపడం అంటే మీకు అన్ని విషయాలు ప్రతికూలంగా జరుగుతాయని కాదు. ఈ రాశులకు చెందిన వ్యక్తులు ఈ సమయంలో మరింత జాగ్రత్తగా, ఓపికగా, ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. అంతేకాదు ఈ ప్రభావాలను నివారించడానికి, క్రమం తప్పకుండా సూర్యభగవానుడిని పూజించి, ఆయనకు అర్ఘ్యం సమర్పించండి. ఆదివారం ఉపవాసం ఉండి మీ తండ్రిని , ఇతర పెద్దలను గౌరవించండి. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. మాటను అదుపులో ఉంచుకోండి. పేదలకు, అవసరార్థులకు దానం చేయండి
Also Read
- నేటి జాతకములు…11 జూలై, 2025
- Hindu Epic Story: స్వర్గాధికధిపతి ఇంద్రుడు ఒళ్ళంతా కళ్ళే.. ఈ శాపం వెనుక పున్న పురాణ కథ ఏమిటంటే..
- Vipareeta Raja Yoga: నెల రోజులు చక్రం తిప్పేది ఈ రాశులవారే..! ఇందులో మీ రాశి ఉందా?
- నా లాగా ఎవరూ మోసపోవద్దు.. కుమారుడు జాగ్రత్త.. అయ్యో అనూష
- Andhra: వదినపై కన్నేసి సెట్ చేశాడు.. కానీ, మరిది అడ్డుగా ఉన్నాడని.. మాస్టర్ స్కెచ్.. చివరకు
- బడా వ్యాపారులే టార్గెట్.. ఫేక్ పోలీసుల చేతివాటం.. భారీగా నగలు, నగదు వాహనాలతో..
- గిరిజన కుటుంబాన్ని గ్రామం నుంచి వెలేశారు..! కారణం ఏంటో తెలుసా..?
- పొలాల్లో పడి ఉన్న రెండేళ్ల బాలుడు..! స్థానికులు దగ్గరికెళ్లి చూడగా.. గుండెపగిలే దృశ్యం
- ఎంతకు తెగించావ్రా ప్రిన్సిపాల్.. పీరియడ్స్‌లో ఉన్నారో లేదో చెక్ చేయడానికి బాలికల బట్టలిప్పి!
- AP Crime: ఏపీలో దారుణం.. భార్యను నరికి.. గొంతు కోసుకున్న భర్త!