Telugu Astrology: జనవరి 5 నుంచి 15వ తేదీ వరకూ ధనూ రాశిలో బుధ, రవులు కలిసి సంచారం చేయడం జరుగుతోంది. ఈ రెండు గ్రహాలు ధనూ రాశిలో కలుసుకోవడం వల్ల వీటికి రెట్టింపు బలం కలుగుతుంది. ధనూ రాశి యాంబిషన్ కు సంబంధించిన రాశి అయినందువల్ల ఇక్కడ రవి బుధుల కలయిక అత్యధికంగా ఫలితాలనిచ్చే అవకాశముంది.
కొత్త ఏడాది కొన్ని రాశులకు శుభ సూచకాలతో ప్రారంభం అవుతోంది. జనవరి 5 నుంచి 15వ తేదీ వరకూ ధనూ రాశిలో బుధ, రవులు కలిసి సంచారం చేయడం జరుగుతోంది. ఈ రెండు గ్రహాలు ధనూ రాశిలో కలుసుకోవడం వల్ల వీటికి రెట్టింపు బలం కలుగుతుంది. ధనూ రాశి యాంబిషన్ కు సంబంధించిన రాశి అయినందువల్ల ఇక్కడ రవి బుధుల కలయిక (బుధాదిత్య యోగం) అత్యధికంగా ఫలితాలనిస్తుంది. మేషం, మిథునం, సింహం, వృశ్చికం, ధనుస్సు, కుంభ రాశివారికి ఈ యోగం వల్ల అనేక శుభ ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశం ఉంది.
మేషం: ఈ రాశికి భాగ్య స్థానంలో రవి, బుధులు కలవడం వల్ల ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా సర్వత్రా ప్రాభవం పెరుగుతుంది. పేరు ప్రఖ్యాతులు బాగా పెంపొందుతాయి. అనేక విధాలుగా సంపద పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులకు కూడా ఇతర దేశాల్లో అవకాశాలు లభిస్తాయి. వ్యక్తిగత జాతకంలో ఎటువంటి దోషాలున్నా తొలగిపోతాయి. జీవితంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. శీఘ్ర పురోగతి ఉంటుంది.
మిథునం: రాశ్యధిపతి బుధుడితో రవి సప్తమ స్థానంలో కలవడం వల్ల ఈ రాశివారికి సామాజికంగా స్థాయి, హోదా పెరుగుతాయి. ప్రముఖులతో సత్సంబంధాలు ఏర్పడడం వల్ల పలుకుబడి బాగా వృద్ధి చెందుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, వ్యాపారాల్లో భాగ స్వాములతో సమస్యలు పరిష్కారమై, రాబడి బాగా పెరుగుతుంది. ప్రభుత్వపరంగా గుర్తింపు లభిస్తుంది.
సింహం: ఈ రాశికి పంచమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడినందువల్ల, అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలిసే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభించడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. ప్రతిభకు, సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి లాభాలను పండిస్తాయి.
వృశ్చికం: ఈ రాశికి ధన స్థానంలో రవి, బుధుల కలయిక వల్ల ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంటుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారే అవకాశం కూడా ఉంటుంది. నిరుద్యోగులకు భారీ జీత భత్యాలతో కూడిన ఉద్యోగం లభిస్తుంది. మీ సలహాలు, సూచనల వల్ల అధికారులు బాగా లాభపడతారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయి. కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబంలో విభేదాలు తొలగిపోతాయి.
ధనుస్సు: ఈ రాశిలో బుధ రవులు కలవడం వల్ల ఈ రాశివారికి ప్రముఖుడుగా గుర్తింపు లభిస్తుంది. పలుకుబడి బాగా వృద్ధి చెందుతుంది. అనేక విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. సంతాన లాభం కలుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
కుంభం: ఈ రాశికి లాభ స్థానంలో ఈ రెండు గ్రహాల కలయిక వల్ల అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అందలాలు ఎక్కడం జరుగుతుంది. వ్యాపారాలు అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. విదేశీ యానానికి అవరోధాలు, ఆటంకాలు తొలగిపోతాయి. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆస్తి సమస్యలు, వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గిపోతాయి.
Also read
- శారీరకంగా వాడుకొని యువతిని మోసం చేసిన ప్రియుడు ప్రవీణ్…. వీడియో
- ఈ కోనలో వెలసిన నృసింహస్వామికి నారద, తుంబురుడు రోజూ పూజలు.. సాక్ష్యంగా తులసీదళాలు.. ఆలయం ఎక్కడంటే..
- Vaikunta Ekadasi 2025: 2025 సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు? తేదీ, పూజా విధానం తెలుసుకోండి..
- Malavya Rajyog in 2025: కొత్త ఏడాదిలో మీన రాశిలో శుక్ర సంచారం.. ఈ రాశులకు చెందిన వ్యక్తులు పట్టిందల్లా బంగారమే..
- Shabarimala: శబరిమల ఆలయంలో మండల పూజ ఎప్పుడు? పూజా విధానం, ప్రాముఖ్యత తెలుసుకోండి