SGSTV NEWS online
AstrologyUgadi Rasi Phalalu

Ugadi 2026: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. సింహ రాశి వారికి ఎలా ఉందంటే..?

Ugadi 2026 Panchangam Simha Rashi Phalalu: అష్టమ శనిప్రభావం, సప్తమ రాహు, వ్యయస్థాన గురు సంచారం కారణంగా సింహ రాశి వారికి కొత్త సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. పనుల్లో జాగ్రత్త అవసరం. తొందరపడి వాగ్దానాలు ఇవ్వకపోవడం మంచిది. ఆర్థికంగా ఆదాయం పెరుగుతుంది.. కానీ ఖర్చులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి, రావలసిన డబ్బు సులభంగా లభిస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు..

ఆదాయం-5, వ్యయం-5 | రాజపూజ్యం-7, అవమానం-7

ఈ రాశికి అష్టమంలో శని సంచారం, సప్తమంలో రాహువు, వ్యయ స్థానంలో స్థానంలో గురు సంచారం సింహ రాశివారికి మిశ్రమ ఫలితాలనివ్వడం జరుగుతుంది. ఈ రాశివారు పనులు, వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. తొందరపడి ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం ఉత్తమం.

ఆర్థిక వ్యవహారాలుః ఆదాయం పెరుగుతున్నప్పటికీ, ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. దాదాపు ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య పరిష్కారం అవు తుంది. ఆదాయ వృద్ధి సూచనలున్నాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు సైతం వసూలు అవుతాయి.

వృత్తి, ఉద్యోగాలుః వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం వృద్ది చెందుతుంది కానీ, పనిభారం లేదా బరువు బాధ్యతలు ఎక్కువై విశ్రాంతి తగ్గుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా సమస్యలున్నప్పటికీ, చివరికి అంతా సానుకూలంగా జరిగిపోతుంది. నిరుద్యో గులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగం మారే ప్రయత్నాలు ఫలించక పోవచ్చు.

కుటుంబ వ్యవహారాలుః కుటుంబ సభ్యులకు సంబంధించి శుభ కార్యాలు జరగడానికి అవకాశం ఉంది. కుటుంబం మీద ఖర్చులు పెరుగుతాయి. దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, ఉద్యోగాలు సతీమణికి అనుకూలంగా ఉంటాయి

Related posts