SGSTV NEWS online
AstrologySpiritual

వృషభ రాశిలోకి కుజుడు..వీరికి ధనానికి ధన్యానికి లోటే ఉండదు!

 



త్వరలో కుజ గ్రహం వృషభ రాశిలోకి ప్రవేశించనుంది. ఈ సంచారం వృషభ, కర్కాటక, మీన, కుంభ రాశుల వారికి విశేష ప్రయోజనాలను అందిస్తుంది. ఆర్థికంగా లాభాలు, వృత్తిలో పురోగతి, సమాజంలో గౌరవం, వ్యక్తిగత ఆనందం వంటివి చేకూరుతాయి. పెట్టుబడులు, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఈ మార్పు వీరికి ధనానికి, ధాన్యానికి లోటు లేకుండా చేస్తుంది.


అన్ని గ్రహాలలో కుజ గ్రహం చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది.  ఈ గ్రహం శక్తికి, పరాక్రమానికి అధిపతి అంటారు. నవ గ్రహాలలో సేనాధిపతిగా ఇది కొనసాగుతుంది. అయితే అన్ని గ్రహాలలోలాగే కుజ గ్రహం కూడా రాశి సంచారం , నక్షత్ర సంచారం చేయడం సహజం. అయితే అతి త్వరలో ఈ గ్రహం వృషభ రాశిలోకి సంచారం చేయనుంది. దీని వలన నాలుగు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయంట.




వృషభ రాశి : కుజ గ్రహ సంచారం వలన వృషభ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీరు ఆర్థికంగా మంచి లాభాలు అందుకోవడమే కాకుండా, గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి అత్యధిక లాభాలు అందుకుంటారు. వ్యాపార పరంగా అద్భుతంగా ఉంటుంది. ఎవరు అయితే చాలా రోజుల నుంచి సొంత వాహనం కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో, వారి కోరిక నెరవేరుతుంది. ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది.



మీన రాశి : ఈ రాశి వారు సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పొందుతారు. పెట్టుబడుల నుంచి అత్యధిక లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఎవరు అయితే చాలా రోజుల నుంచి వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటున్నారో వారికి ఇది అనుకూలమైన సమయం. వైవాహిక జీవితం ఆనదంగా ఉంటుంది. ప్రేమ పెళ్లి చేసుకోవాలి అనుకునే వారికి కూడా ఇది చాలా బెస్ట్ టైమ్ అని చెప్పాలి.


కుంభరాశి : కుంభ రాశి వారికి కెరీర్ పరంగా ఉన్న అడ్డంకులు అన్నీ తొలిగిపోతాయి. చాలా ఆనందంగా గడుపుతారు. చాలా రోజుల నుంచి కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేయాలి అనుకునేవారు తమ కోరికను నెరవేర్చుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్టదైవాన్ని ప్రార్థించడం వలన అన్ని సమస్యలు తొలిగిపోయి ఆనందంగా ఉంటారు.

Also read

Related posts