జ్యోతిష్య శాస్త్రంలో శని రాహు గ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ మార్చిలో శని, రాహువుల మీన రాశిలో సంయోగం జరగనుంది. అప్పుడు పిశాచ యోగం ఏర్పడనుంది. ఈ యోగం ఏర్పడినప్పుడు కొన్ని రాశుల జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కనుక అప్పుడు కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని, సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని జ్యోతిష్కులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపధ్యంలో పిశాచ యోగం ఎప్పుడు ఏర్పడుతుంది? ఎ రాశులు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం..
ఎవరైనా సరే తమ జాతకంలో శని, రాహు గ్రహాల ప్రభావం పడకూడదని కోరుకుంటారు. ఎందుకంటే శనీశ్వరుడు కర్మ ప్రధాత, రాహువు ఛాయ గ్రహం కనుక ఈ గ్రహాలను చెడు గ్రహాలుగా భావిస్తారు. అయితే మార్చి నెలాఖరులో శనీశ్వరుడు, రాహువు 30 ఏళ్ల తర్వాత కలవనున్నారు. అంటే శని, రాహువు మీన రాశిలో కలవనున్నారు. ఈ సంయోగం వలన పిశాచ యోగం ఏర్పడుతుంది. జ్యోతిషశాస్త్రంలో ఈ యోగం చాలా ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది. శని, రాహు గ్రహాలు రెండూ కలిసినప్పుడు పిశాచ యోగం ఏర్పడుతుంది. ఇది అత్యంత అశుభ యోగంగా జ్యోతిష్యశాస్త్రం పేర్కొంది.
మార్చి 29న శనీశ్వరుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. రాహువు మే 18 వరకు మీనరాశిలో ఉంటాడు. అటువంటి పరిస్థితిలో ఈ సంయోగం ప్రభావం ఈ 5 రాశుల వ్యక్తులపై దాదాపు రెండు నెలల పాటు ఉంటుంది. ఈ 5 రాశుల వారు కెరీర్ నుంచి జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
శని రాహు సంయోగ ప్రభావాలు:
వృషభరాశి: వృషభ రాశి వారిపై శని, రాహువుల మూడవ అంశం పడుతుంది. అటువంటి పరిస్థితిలో ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ స్నేహితుల కారణంగా సమస్యలను ఎదుర్కొంటారు. కనుక ఈ సమయంలో ఎవరినీ నమ్మవద్దు. కుటుంబ భారాన్ని మోయవలసి ఉంటుంది. కొన్ని చెవి సంబంధిత సమస్యలు వీరిని ఇబ్బంది పెట్టవచ్చు. అంతేకాదు భుజం సంబంధిత సమస్యలు కూడా వేధించవచ్చు.
మిథున రాశి: శని, రాహువులు మిథున రాశి 10వ ఇంట్లో సంచరించనున్నారు. ఈ కారణంగా పలు రంగాల నిపుణులు, వ్యాపారవేత్తలు తమ పనిలో ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది. కీళ్లకు సంబంధించిన సమస్యలు, చర్మ అలెర్జీలు తలెత్తవచ్చు. బహుళజాతి కంపెనీలలో పనిచేసే వారు వర్క్ విషయంలో ఒత్తిడిని పెంచుకోవచ్చు.
సింహ రాశి: శని, రాహువు సంచారము సింహరాశి 8వ ఇంట్లో ఉన్నందున ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు నష్టాలు ఎదుర్కొనవచ్చు. శత్రువులు చాలా బలంగా ఉంటారు.. కనుక చాలా జాగ్రత్తగా పని చేయాలి. సంబంధాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్యానికి సంబంధించిన చిన్న సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు, ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపిస్తుంది. అప్పులు చేయాల్సి రావచ్చు.
కన్య రాశి: శని , రాహువులు కన్యారాశి 7వ ఇంట్లో సంచారము చేస్తారు. అటువంటి పరిస్థితిలో ఈ రాశికి చెందిన వారు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కొన్ని సమస్యలు వీరిని ఇబ్బంది పెట్టవచ్చు, వీరు తమ భాగస్వామితో విభేదాలను ఎదుర్కొనాల్సి వస్తుంది. ప్రేమ లోపిస్తుంది. జీవితంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఆహారపు అలవాట్లపై విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అలాగే భాగస్వామ్యంలో పనిచేసే వారు తమ వ్యాపార భాగస్వామి చేతుల్లో మోసపోవచ్చు.
ధనుస్సు రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా పని చేయాలి. అలాగే అత్తాకోడళ్ల మధ్య వాదనలు ఏర్పడవచ్చు. ఇది ఆగ్రహానికి దారితీయవచ్చు. పని విషయంలో చాలా సమస్యలు కలిగే అవకాశం ఉంది. శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉంది కనుక వీరు తమ కోపాన్ని నియంత్రించుకోవాలి. లేకపోతే పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తుల ప్రతిష్ట కూడా దెబ్బతింటుంది
Also read
- Bomb attack: భద్రాచలం ఆస్పత్రిపై బాంబు దాడి.. రోగులు, సిబ్బందితోపాటు!
- బయటపడిన పురాతన విగ్రహాలు! ఇంకా ఉన్నాయి, తవ్వకాలు జరపాలని స్థానికుల డిమాండ్
- అక్రమ సంబంధం… భార్య రాగానే గోడ దూకి భర్త పరార్!
- ATM చోరీ కోసం యత్నించిన దొంగలు! ఊహించని ట్విస్ట్‌తో పరుగో పరుగు
- అయ్యో పాపం.. పసిబిడ్డను బలితీసుకున్న పందికొక్కులు! కన్నీళ్లు పెట్టించే ఘటన
- ఎన్నిసార్లు పిలిచినా ప్రియుడు ఇంటికి రాలేదని.. వివాహిత ఆత్మహత్య?
- Shani Rahu Yuti: 30 ఏళ్ల తర్వాత శని-రాహువు సంయోగంతో పిశాచ యోగం.. ఈ 5 రాశుల వారి జీవితం సమస్యల సుడిగుండం..
- Astrology remedies: పూజలు, హోమాలు అక్కర్లేదు.. మూగజీవాలకు ఈ ఆహారం పెడితే సిరి సంపదలు మీ వెంటే..
- Money Astrology: గురువుకు బాగా నచ్చిన రాశులివే.. వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి ఛాన్స్..!
- Holi 2025: హోలీ రోజున ఈ పరిహారాలు చేయండి.. గ్రహ దోషాలు తొలగి సుఖ సంతోషాలు మీ సొంతం..