జ్యోతిషశాస్త్రం ప్రకారం కర్మ ఫలాలను ఇచ్చే శనీశ్వరుడు మార్చి 29వ తేదీన తన రాశిని మార్చుకుని కుంభ రాశి నుంచి మీన రాశిలోకి అడుగు పెట్టనున్నాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న శుక్రుడు తో కలవనున్నాడు. అంటే రేపు ఒకే రాశిలో శని, శుక్రుల సంయోగం జరగనుంది. ఈ సమయంలో కొన్ని రాశులకు సంబంధించిన వ్యక్తులు భారీగా ఆర్ధిక ప్రయోజనాలను పొందవచ్చు. పదోన్నతిని పొందే అవకాశం ఉంది.
జ్యోతిషశాస్త్రంలో శనీశ్వరుడు కర్మ ఫలాలను ఇచ్చే దైవంగా పిలుస్తారు, అంటే శనీశ్వరుడు మనిషి చేసే మంచి, చెడు కర్మల ప్రకారం ఫలాలను ఇస్తాడు. శుక్ర గ్రహం ఆనందం, శ్రేయస్సు.. గొప్పతనానికి కారకంగా పరిగణించబడుతుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం నవ గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచరిస్తూ ఉంటారు. అదే సమయంలో నక్షత్రరాశులను కూడా మారుస్తాయి. ఈ సందర్భంలో చాలా సార్లు రెండు గ్రహాలు ఒకే రాశిలోకి ప్రవేశించి ఒక సంయోగాన్ని ఏర్పరుస్తాయి. ఇలా గ్రహాల సంయోగం మొత్తం 12 రాశుల ప్రజలను ప్రభావితం చేస్తుంది. ఈసారి కూడా అలాంటిదే జరగబోతోంది.
మార్చి 29న, దాదాపు 30 సంవత్సరాల తర్వాత శనీశ్వరుడు, శుక్రుడు మీన రాశిలో కలవనున్నారు. ఈ రోజున సంవత్సరంలో మొదటి సూర్య గ్రహణం కూడా ఏర్పడనుంది. కనుక ఈ సంయోగం మరింత ముఖ్యమైనదిగా పరిగణిస్తున్నారు. కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది.
శని, శుక్ర గ్రహాల కలయిక ఈ రాశుల వారికి మంచి రోజులు ప్రారంభం..
వృషభ రాశి: ఈ రాశికి చెందిన వారికి శనీశ్వరుడు, శుక్రుల కలయిక చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో వృషభ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. ఇప్పటికే పెట్టిన పెట్టుబడుల నుంచి లాభం పొందుతారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ఆర్ధికంగా పురోగతి సాధించవచ్చు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు, గౌరవం పెరుగుతుంది.
మిథున రాశి: శుక్రుడు, శనీశ్వరుడు కలయిక మిథున రాశి వారికి అద్భుతాలు చేయగలదు. ఈ సమయంలో మిథున రాశి వారు కెరీర్ , వ్యాపారంలో భారీ విజయాన్ని పొందవచ్చు. ఈ సంయోగం భారీ ఆర్థిక ప్రయోజనాలను తెస్తుంది. ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతి లభించే అవకాశం ఉంది. అంతేకాదు ప్రేమ, వివాహ జీవితంలో సామరస్యం, ఆనందం పెరుగుతాయి.
ధనుస్సు రాశి: ఈ రాశి వారికి శుక్రుడు, శని కలయిక ఆనందాన్ని తెస్తుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి వారికి ఆర్థిక లాభం పొందే అవకాశాలు ఉంటాయి. వీరు ఆస్తి కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారం చేసే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. పురోగతికి మార్గాలు తెరుచుకుంటాయి. కుటుంబం, బంధువులతో సంతోషంగా గడుపుతారు
Also read
- సీతాదేవి తనువు చాలిస్తూ భూమిలో ఐక్యం అయిన ప్రదేశం ఎక్కడుందో తెలుసా..
- దైవ దర్శనకోసం వెళ్తే దారుణం.. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే.. సంచలన విషయాలు..
- శ్రీ రామ నవమి పండగ విషయంలో గందరగోళం.. ఏప్రిల్ 5 లేదా 6 ఎప్పుడంటే
- మహిళల రుతు సమయం గురించి గరుడ పురాణం ఏం చెబుతుందో తెలుసా..?
- AP Crime: ఏపీలో దారుణం.. యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువతి!