SGSTV NEWS online
AstrologySpiritual

మహాశివరాత్రి నాడు అద్భుత గ్రహాల సంయోగం.. ఈ రాశులవారికి ఆకస్మిక ధన లాభం



Rare Graha conjunction: మహా శివరాత్రి నాడు గ్రహాల మార్పుల వల్ల అరుదైన సంయోగం ఏర్పడి కొన్ని రాశుల వారికి విశేష ఫలితాలు అందుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆర్థికంగా మంచి పురోగతి కనిపించే సూచనలు ఉన్నాయి. అరుదైన సంయోగం వల్ల లాభపడే రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

శివపార్వతుల పవిత్ర వివాహాన్ని స్మరించుకుంటూ భక్తులు ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకునే పండుగే మహాశివరాత్రి. ఈసారి ఫిబ్రవరి 15న వస్తున్న ఈ మహోత్సవానికి ప్రత్యేకమైన జ్యోతిష్య ప్రాధాన్యం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అదే రోజున మూడు ప్రధాన గ్రహాలు సంచారం చేయడం విశేషం. కుజుడు, చంద్రుడు తమ స్థానాలను మార్చుకోగా.. బుధుడు శతభిషా నక్షత్రం నుంచి పూర్వభాద్రపాద నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. అలాగే కుజుడు, చంద్రుడు శ్రవణ నక్షత్రం నుంచి ధనిష్ఠ నక్షత్రంలోకి సంచరిస్తారు. ఈ గ్రహ మార్పుల వల్ల అరుదైన సంయోగం ఏర్పడి కొన్ని రాశుల వారికి విశేష ఫలితాలు అందుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆర్థికంగా మంచి పురోగతి కనిపించే సూచనలు ఉన్నాయి. అరుదైన సంయోగం వల్ల లాభపడే రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి
ఈ సంయోగ ప్రభావంతో మేషరాశి వారికి శుభఫలితాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధైర్యంగా ప్రారంభించిన పనులు విజయవంతమవుతాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. పెట్టుబడులు మంచి ఫలితాలు ఇవ్వవచ్చు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారం కావచ్చు. కుటుంబంలో సంతోష వాతావరణం నెలకొంటుంది. ఆకస్మిక ధనలాభాలు కలగవచ్చు.

మిథున రాశి
మిథునరాశి వారికి ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. పూర్వీకుల ఆస్తుల నుంచి లాభాలు రావచ్చు. కెరీర్‌లో ఉన్న ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. అదృష్టం అనుకూలించి, నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. వ్యక్తిగత జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకోవచ్చు.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు, ఉద్యోగాల్లో పదోన్నతులు సాధ్యమవుతాయి. బంగారం, వెండి వంటి విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశముంది. అప్పుల నుంచి కొంత ఉపశమనం లభించవచ్చు. ఆరోగ్యం కూడా మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి.

మకర రాశి
మకరరాశి వారికి నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. ఆస్తి, కోర్టు సంబంధిత సమస్యలు పరిష్కారం కావచ్చు. వ్యాపార విస్తరణకు అనుకూల సమయం. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఇది శుభకాలంగా ఉంటుంది. కెరీర్‌లో పురోగతి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గమనిక: ఇవి జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా చెప్పబడిన ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత పరిస్థితులపై ఆధారపడి ఫలితాలు మారవచ్చు.

Also read

Related posts