SGSTV NEWS online
Astro TipsSpiritual

Blue Moon: రేపు అరుదైన బ్లూ మూన్ దర్శనం.. ఈ సమయంలోనే, తప్పక చేయాల్సిన పరిహారాలు ఇవే!



Blue Moon: మే 31న కనిపించే పౌర్ణమి ఖగోళ ప్రియులకు ప్రత్యేక ఆకర్షణ కానుంది. ఒకే నెలలో రెండోసారి వచ్చే పౌర్ణమిని బ్లూ మూన్ అని పిలుస్తారు. మే 2026లో తొలి పౌర్ణమి మే 1న, రెండోది మే 31న రావడంతో దీనికి బ్లూ మూన్ అనే పేరు వచ్చింది.


ఈసారి మే 31న కనిపించనున్న పౌర్ణమి ఖగోళ ప్రియులకు ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. ఈ రోజున ఆకాశంలో అరుదైన బ్లూ మూన్ (Blue Moon) దర్శనమివ్వనుంది. ఖగోళ శాస్త్రం ప్రకారం, ఒకే క్యాలెండర్ నెలలో రెండు పౌర్ణములు సంభవిస్తే, రెండో పౌర్ణమిని బ్లూ మూన్‌గా పిలుస్తారు. మే 2026లో మొదటి పౌర్ణమి మే 1న రాగా, రెండో పౌర్ణమి మే 31న వస్తుండటంతో దీనికి బ్లూ మూన్ అనే పేరు వచ్చింది. అయితే పేరులో “బ్లూ” ఉన్నప్పటికీ చంద్రుడు నీలం రంగులో కనిపించడు. ఇది కేవలం ఖగోళ గణనల ఆధారంగా వచ్చిన పేరు మాత్రమే. ఈసారి బ్లూ మూన్‌తో పాటు ఇది ఒక మైక్రోమూన్ కూడా. అంటే చంద్రుడు భూమికి కొంచెం ఎక్కువ దూరంలో ఉండటం వల్ల సాధారణ పౌర్ణమి కంటే స్వల్పంగా చిన్నగా, కాస్త మసకగా కనిపించవచ్చు.


భారతదేశంలో ఈ బ్లూ మూన్‌ను మే 31 సాయంత్రం సూర్యాస్తమయం అనంతరం వీక్షించవచ్చు. సాయంత్రం సుమారు 6:30 గంటల నుంచి 7:30 గంటల మధ్య చంద్రుడు స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది. వాతావరణం నిర్మలంగా ఉంటే ఎలాంటి టెలిస్కోప్ లేదా బైనాక్యులర్స్ అవసరం లేకుండానే ఈ అద్భుత దృశ్యాన్ని ఆస్వాదించవచ్చు.

బ్లూ మూన్ సందర్భంగా ఆచరించదగిన సంప్రదాయ పరిహారాలు

హిందూ విశ్వాసాల ప్రకారం పౌర్ణమి రోజున చంద్రుడు, మహావిష్ణువు, మహాలక్ష్మీదేవిని ఆరాధించడం శుభప్రదంగా భావిస్తారు. ఈ సందర్భంగా చాలామంది పాటించే కొన్ని ఆచారాలు ఇవి




👉  చంద్రుణ్ని దర్శించి నీరు లేదా అర్ఘ్యం సమర్పించండి.

👉  ఓం సోమాయ నమః” మంత్రాన్ని 108 సార్లు జపించండి.

👉   పాలు, బియ్యం లేదా తెల్లని మిఠాయిలను దానం చేయండి.

👉  కొంత సమయం ధ్యానం చేసి మనశ్శాంతిని పొందేందుకు ప్రయత్నించండి.

👉  వెన్నెలలో కొద్దిసేపు ప్రశాంతంగా గడపండి.

👉  మహాలక్ష్మీదేవిని పూజించి పాయసం నైవేద్యంగా సమర్పించండి.

👉  కుటుంబ సుఖశాంతుల కోసం ఇంట్లో దీపం వెలిగించండి.

ఖగోళపరంగా చూస్తే బ్లూ మూన్ ఒక అరుదైన సహజ సంఘటన. ఆధ్యాత్మికంగా చూసేవారికి ఇది ప్రార్థన, ధ్యానం, ఆత్మపరిశీలనకు అనుకూలమైన సందర్భంగా భావించబడుతుంది. మే 31 సాయంత్రం ఆకాశాన్ని వీక్షిస్తూ ఈ అరుదైన పౌర్ణమి అందాలను ఆస్వాదించండి.

Related posts