April 18, 2025
SGSTV NEWS
Astrology

రాజా యోగ: శుక్ర, రవులతో మహా యోగాలు.. ఆ రాశులకు పట్టిందల్లా బంగారం..!

శుక్రుడు, సూర్యుడు ఉచ్ఛస్థితిలో ఉండటం వల్ల మిథునం, కర్కాటకంతో పాటు మరికొన్ని రాశుల వారికి మే 14 వరకు రాజయోగాలు, ధనయోగాలు ఏర్పడతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి, ఆదాయవృద్ధి, విదేశీ అవకాశాలు లభించే అవకాశం ఉంది. కొన్ని రాశులకు ప్రభుత్వ గుర్తింపు, పదోన్నతులు కూడా లభించవచ్చు. ఈ కాలంలో ఆర్థికంగా, వ్యక్తిగతంగా అనుకూల పరిణామాలు చోటుచేసుకుంటాయి.

శుక్ర, రవులు రాజయోగ గ్రహాలు. రాజకీయాలకు, ప్రభుత్వానికి, అధికారానికి, ఐశ్వర్యానికి కారకులైన ఈ గ్రహాలు 13వ తేదీ నుంచి కొన్ని రాశులవారి దశను, దిశను మార్చబోతున్నాయి. ప్రస్తుతం మీన రాశిలో ఉచ్ఛ స్థితిలో, వక్ర గతిలో ఉన్న శుక్రుడు ఈ నెల 13 నుంచి వక్ర త్యాగం చేసి, సవ్య దిశలో సంచారం చేయబోతున్నాడు. అదే రోజు నుంచి రవి మేష రాశిలో ఉచ్ఛపట్టడం జరుగుతోంది. ఈ రెండు గ్రహాలు ఉచ్ఛ స్థితిలో పూర్ణ బలంతో సంచారం చేస్తున్నందువల్ల మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, మకరం, కుంభ రాశులకు మే 14 వరకూ రాజయోగాలు, ధన యోగాలు కలిగే అవకాశం ఉంది.

👉  మిథునం: ఈ రాశికి 10వ స్థానంలో శుక్రుడు, 11వ స్థానంలో రవి ఉచ్ఛస్థితుల్లో ఉన్నందువల్ల జీవితంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పడుతుంది. ఆదాయం కూడా ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో వేతనాలు, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరిగే సూచనలున్నాయి. నిరుద్యోగులకు భారీ జీతభత్యాలతో కూడిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉన్నత కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.

👉  కర్కాటకం: ఈ రాశికి భాగ్య స్థానంలో శుక్రుడు, దశమ స్థానంలో రవి ఉచ్ఛపట్టడం వల్ల ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది. విదేశీ సంపాదన అనుభవించే యోగం పడుతుంది. ఉద్యోగులకు బాగా డిమాండ్ ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఇదివరకటి కంటే బాగా మెరుగ్గా ఉంటాయి. వారసత్వ సంపదతో పాటు పిత్రార్జితం కూడా లభిస్తుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. అనారోగ్యానికి తగిన చికిత్స లభిస్తుంది.

👉  తుల: రాశ్యదిపతి శుక్రుడు ఉచ్ఛ స్థితిలో ఉండడం, సప్తమ స్థానంలో రవికి ఉచ్ఛ స్థితి కలగడం వల్ల ఈ రాశివారికి ప్రభుత్వమూలక గుర్తింపు లభించడం, ప్రభుత్వమూలక ధన లాభం కలగడం వంటివి జరుగుతాయి. రాజకీయాల్లో ఉన్నవారికి ప్రాబల్యం పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయ త్నిస్తున్నవారికి ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉన్నందు వల్ల ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది.

👉  ధనుస్సు: ఈ రాశికి చతుర్థ స్థానంలో శుక్రుడు, పంచమ స్థానంలో రవి ఉచ్ఛపట్టడం వల్ల ఆర్థికంగా అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. ఉద్యోగంలో సమర్థతకు గుర్తింపు లభించడంతో పాటు పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపా రాలు లాభాల బాటపడతాయి. రాజపూజ్యాలు, ఆదాయాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

👉  మకరం: ఈ రాశికి తృతీయ స్థానంలో శుక్రుడు, చతుర్థ స్థానంలో రవి ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. ముఖ్యంగా ఆదాయ, ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు అంచనాలకు మించిన ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతికి బాగా అవకాశం ఉంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు విస్తరిస్తాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ప్రభుత్వపరంగా లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

👉  కుంభం: ఈ రాశికి ధన స్థానంలో శుక్రుడు, తృతీయ స్థానంలో రవి ఉచ్ఛ పట్టడం వల్ల ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా గడిచిపోతుంది. మాటకు విలువ పెరుగుతుంది. మీ సలహాలు, సూచనల వల్ల అధికారులు లేదా సంస్థలు లబ్ధి పొందుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలగడంతో పాటు జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కష్టనష్టాల నుంచి బయటపడతాయి. ఆదాయం అనేక మార్గాల్లో వృద్ధి చెందుతుంది.

Alsp read

Related posts

Share via