SGSTV NEWS
Astro TipsAstrology

Budh gochar 2025: ఈ నెలలో రెండు సార్లు బుధ సంచారం.. ఏర్పడనున్న ధన వృద్ధి యోగం..

 
ఈ రాశులవారిపై లక్ష్మీదేవి కటాక్షం అపారం..
జూన్ నెలలో గ్రహాల రాకుమారుడు బుధుడు తన గమనాన్ని రెండుసార్లు మార్చుకోనున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ బుధ సంచారము వలన మొత్తం రాశులపై మంచి చెడుల ప్రభావం చూపిస్తుంది. ఆయితే కొన్ని రాశులకు చెందిన వారు మాత్రం బహు ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో జూన్ నెలలో బుధుడు సంచారము ఎప్పుడు, ఆ అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం..


వృత్తి, వాక్కు, తెలివితేటలు, వ్యాపారానికి కారకుడైన బుధుడిని జ్యోతిషశాస్త్రంలో గ్రహాల రాకుమారుడు అంటారు. జూన్ నెలలో బుధుడు తన గమనాన్ని రెండుసార్లు మార్చుకోనున్నాడు. మిథునరాశి, కర్కాటకరాశిలో ఈ రాశి మార్పు జరుగుతుంది. నిర్జల ఏకాదశి రోజున అంటే జూన్ 6న ఉదయం 6.29 గంటలకు బుధుడు మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. 25 రోజుల తర్వాత బుధుడు మిథున రాశిని విడిచి మరొక రాశిలోకి అడుగు పెడతాడు. అంటే జూన్ 22, 2025న బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. జూన్ నెలలో బుధుడు ఈ రెండు సంచారాలు ధన వృద్ధి యోగాన్ని సృష్టిస్తాయి. దీంతో అనేక రాశులకు ప్రయోజనం చేకూరనుంది. బుధుడి మార్పుతో ప్రయోజనాలు పొందే రాశులు ఏమిటో తెలుసుకుందాం..


మేష రాశి: మేష రాశి వారికి వ్యాపారపరంగా లాభం చేకూరుతుంది. ఈ సమయంలో మేష రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఎప్పటి నుంచి ఆగి ఇబ్బంది పెడుతున్న పనులు, చెడిపోయిన పనులు కూడా మళ్ళీ పట్టలేక్కుతాయి. పూర్తి అవుతాయి. సమాజంలో వీరికి గౌరవం పెరుగుతుంది. పాత అప్పులు, రుణాలు తీర్చేస్తారు. మొత్తం మీద బుధ సంచారంతో ఏర్పడే ధన వృద్ధి యోగం మేష రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.

మిథున రాశి: బుధ సంచారము మిథున రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగ, రాజకీయ పదోన్నతికి బలమైన అవకాశాలు ఉన్నాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. వ్యాపారస్తులు తమ వ్యాపారంలో వృద్ధి చెందుతారు. ఈ సమయం ఈ రాశికి చెందిన వృత్తి, వ్యాపార, ఉద్యోగస్తులకు మాత్రమే కాదు స్టూడెంట్స్ కి కూడా శుభప్రదమైనది. అదృష్టకరమైనది.



సింహ రాశి: సింహరాశి వారికి బుధ సంచారము చాలా బాగుంటుంది. సింహరాశి వారి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. దీంతో ఇంట్లో ఏర్పడిన కష్టాలు తొలగిపోతాయి. అలాగే చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పని పూర్తవుతుంది. ఈ రాశి వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని చాలా కాలంగా విస్తరించాలని ప్లాన్ చేస్తుంటే.. ఇదే సరైన సమయం.. వ్యాపార విస్తరణ కూడా పూర్తవుతుంది.

కన్య రాశి: బుధ సంచారము కన్య రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సంచారము కన్య రాశి వారికి ఆనందాన్ని ఇస్తుంది. ఈ సమయంలో కన్య రాశి వారికి కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం లభిస్తుంది. వీరు ఉద్యోగం, వృత్తిలో కొత్త స్థాయికి చేరుకుంటారు. చేపట్టిన ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు

Also read

Related posts

Share this