ఈ రోజు (జనవరి 13 వ తేదీ)హిందువులకు వెరీ వెరీ స్పెషల్.. ఓ వైపు భోగి పండగ. మరోవైపు ప్రయాగరాజ్ లో మహా కుంభ వేడుక ప్రారంభం అయింది. అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం 144 సంవత్సరాల తర్వాత ఈ రోజు అనేక అరుదైన యాదృచ్ఛిక సంఘటనలు జరుగుతున్నాయి. ఈ శుభ యోగ ప్రభావం మొత్తం 12 రాశుల మీద కనిపించనుండి. అయితే 3 రాశుల వారికి ఈ అరుదైన యోగం వలన అదనపు ప్రయోజనం లభిస్తుంది.
భోగి పండగ మాత్రమే కాదు ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమైన మహాకుంభ 2025 చాలా ప్రత్యేకమైనది. 144 సంవత్సరాల తర్వాత గ్రహాల అరుదైన కలయిక ఏర్పడనుంది. అందుకనే మహాకుంభం ప్రత్యేకంగా మారనుంది. ఈ రోజున సూర్యుడు, చంద్రుడు, శని, బృహస్పతి గ్రహాలు శుభ స్థానంలో ఉన్నాయి. సముద్ర మథనం సందర్భంగా ఈ శుభం యాదృచ్ఛికం జరిగిందని చెబుతున్నారు. దీనితో పాటు పూర్ణిమ, రవియోగం, భద్రావస యోగం కూడా ఈ రోజున ఏర్పడుతున్నాయి.
144 ఏళ్ల తర్వాత జరగనున్న ఈ యాదృచ్ఛికం వివిధ రాశులపై వివిధ ప్రభావాలను చూపనుంది. అయితే జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ కలయిక వలన కొన్ని రాశులు అనేక ప్రయోజనాలను పొందబోతున్నాయి. వీరికి మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు ఏర్పడే యాదృచ్చికంతో 3 రాశులకు మంచి సమయం ప్రారంభమవుతుంది. ఆ 3 రాశులు ఏమిటో తెలుసుకుందాం.
మేష రాశి: ఈ రోజున ఏర్పడుతున్న యోగాల వలన గ్రహాల స్థానం మేషరాశి వారికి శ్రమకు తగిన ఫలితాలను ఇస్తుంది. వీరికి విశ్వాసం పెరుగుతుంది. మేష రాశి వారికి ఈ సమయం వ్యాపారానికి కూడా లాభదాయకంగా ఉంటుంది. ఈ కాలంలో వృత్తి, డబ్బు, కుటుంబానికి సంబంధించిన సానుకూల ఫలితాలను పొందే అవకాశం ఉంది. అలాగే ఈ అరుదైన యాదృచ్చికం కారణంగా కోరికలు కూడా నెరవేరుతాయి.
సింహ రాశి: ఈ సమయం కర్కాటక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వీరు కొత్త అవకాశాలు పొందే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతతను పొందుతారు. సింహ రాశి వారు కెరీర్‌లో విజయం సాధిస్తారు. అలాగే ఈ సమయంలో మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ మద్దతు పెరుగుతుంది. సింహ రాశి వారికి పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు.
మకర రాశి: ఈ రాశి వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. బాంధవ్యాలలో మధురం ఉంటుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. వ్యాపారంలో పురోభివృద్ధి కలుగుతుంది. ఈ సమయం మకర రాశి వారికి కొత్త అవకాశాలను తెస్తుంది. పెను మార్పులు కూడా జరగవచ్చు. భవిష్యత్తులో పట్టిందల్లా బంగారంగా మారి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది
Also read
- కార్తీక పౌర్ణమి 2025 తేదీ.. పౌర్ణమి తిథి, పూజకు శుభ ముహూర్తం ఎప్పుడంటే?
 - శని దృష్టితో ఈ రాశులకు చిక్కులు.. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది
 - సాక్షాత్తు ఆ చంద్రుడు ప్రతిష్ఠించిన లింగం! పెళ్లి కావాలా? వెంటనే ఈ గుడికి వెళ్లండి!
 - ఆ విషయాన్ని పట్టించుకోని అధికారులు.. కలెక్టరేట్లో పురుగుల మందు తాగిన రైతు..
 - Viral: ఆ కక్కుర్తి ఏంటి బాబాయ్.! ప్రెగ్నెంట్ చేస్తే పాతిక లక్షలు ఇస్తామన్నారు.. చివరికి ఇలా
 





