March 15, 2025
SGSTV NEWS
Astro TipsAstrology

Lucky Zodiac Signs: బుధ, శుక్రుల యుతి.. ఆ రాశుల వారికి కోరికలు తీర్చనున్నాయ్..!

Telugu Astrology: ఫిబ్రవరి 28 నుండి ఏప్రిల్ 6 వరకు మీన రాశిలో బుధ, శుక్రుల యుతి వల్ల కొన్ని రాశుల వారు అనేక రకాలుగా లబ్ధి పొందుతారు. పెళ్లి సంబంధాలు, ప్రేమ విషయాలు, ఆదాయం పెరుగుదల, ఉద్యోగ అవకాశాలు, ఆస్తి విషయాలలో మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ గ్రహాల యుతి వల్ల కొన్ని రాశుల వారి జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. మరి మీ రాశి కూడా ఇందులో ఉందేమో చెక్ చేసుకోండి.

బుధ, శుక్రుల యుతికి జ్యోతిషశాస్త్రం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంటుంది. ఈ రెండు గ్రహాలు ఏడాదిలో అనేక పర్యాయాలు కలిసే అవకాశం ఉంది. అయినప్పటికీ ఈ రెండు గ్రహాల యుతి వల్ల కొన్ని రాశులవారు తప్పకుండా లబ్ది పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆశించిన పెళ్లి సంబంధాలు కుదరడం, ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధించడం, సుఖ సంతోషాలు వృద్ధి చెందడం, వైవాహిక సమస్యలు పరిష్కారం కావడం, ఆదాయం బాగా పెరగడం వంటివి తప్పకుండా జరిగే అవకాశం ఉంటుంది. ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు మీన రాశిలో కలిసి ఉండబోతున్న శుక్ర బుధుల వల్ల వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, ధనుస్సు, కుంభ రాశులవారు అనేక విధాలుగా లబ్ధి పొందడం జరుగుతుంది.

వృషభం: రాశ్యధిపతి శుక్రుడు లాభ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉండి బుధుడితో కలవడం వల్ల అనుకోకుండా ఒక ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి ఖాయమయ్యే అవకాశం ఉంది. ప్రేమించిన వ్యక్తి నుంచి సానుకూల స్పందన లభిస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి.

మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో బుధ శుక్రులు కలయిక వల్ల ఉద్యోగంలో తప్పకుండా ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. కుటుంబ, దాంపత్య జీవితాల్లోని సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఆస్తి వివాదాలు, సమస్యలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది.

కర్కాటకం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఈ రెండు శుభ గ్రహాల కలయిక వల్ల ఉద్యోగ ప్రయత్నాల్లోనూ, పెళ్లి ప్రయత్నాల్లోనూ ఎక్కువగా విదేశీ అవకాశాలే లభిస్తాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి నిశ్చయం కావడం జరుగుతుంది. ఉద్యోగంలో మీ సమర్థతకు సరైన గుర్తింపు లభిస్తుంది. కీర్తి ప్రతిష్ఠలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది.

కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో ఈ రెండు గ్రహాల యుతి వల్ల సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి నిశ్చయం కావడం వంటివి జరుగుతాయి. అత్యంత ప్రముఖులతో సైతం సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాల కారణంగా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. వైవాహిక సమస్యలు పరిష్కారమై, సాన్నిహిత్యం పెంపొందుతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది.

ధనుస్సు: ఈ రాశిలో నాలుగవ స్థానంలో బుధ, శుక్రులు కలవడం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు వృద్దిలోకి వస్తారు. విలువైన ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో సొంత ఇంటి కల నెరవేరుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత పదవులు లభిస్తాయి. అనేక విధాలుగా ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

కుంభం: ఈ రాశికి ధన స్థానంలో బుధ, శుక్ర యుతి ఏర్పడడం వల్ల ఒకటికి రెండు సార్లు మహా భాగ్య యోగం పడుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర లావాదేవీల కారణంగా దాదాపు ధన వర్షం కురుస్తుంది. ఏలిన్నాటి శని ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది. లాభదాయక పరిచయాలు, లాభదాయక ఒప్పందాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీ అవుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు, రాబడి అంచనాలను మించుతాయి

Also Read

Related posts

Share via