SGSTV NEWS online
Astro TipsAstrology

Lucky Zodiacs: కేతువుకు బలం.. ఈ రాశుల వారికి ఆకస్మిక శుభ పరిణామాలు!

 

నవంబర్ 17 నుండి జనవరి 16 వరకు కేతువు బలం గణనీయంగా పెరుగుతుంది. రవి సంచారం సింహ రాశిలో కేతువును శక్తివంతం చేస్తుంది. దీనితో మిథునం, సింహం, తుల, వృశ్చికం, మీన రాశుల వారికి ఊహించని అదృష్టం, ధన లాభం, ఉద్యోగంలో పురోగతి, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తాయి. ఈ కాలం వారికి శుభ పరిణామాలు, రాజయోగాలు తెస్తుంది.

ఈ నెల(నవంబర్) 17 నుంచి జనవరి 16 వరకు కేతువుకు బాగా బలం పెరగబోతోంది. రాహు కేతువులు ఏ రాశిలో ఉంటే ఆ రాశినాథుడి ఫలితాలనిస్తారు. ప్రస్తుతం కేతువు సింహ రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. సింహ రాశికి అధిపతి అయిన రవి ఈ నెల 17 నుంచి రెండు నెలల పాటు మిత్ర క్షేత్రాలైన వృశ్చిక, ధనూ రాశుల్లో, సంచారం చేస్తున్నందువల్ల రవికి బలం పెరిగింది. రవికి చెందిన సింహ రాశిలో సంచారం చేస్తున్నందువల్ల కేతువుకు కూడా బలం పెరుగుతుంది. దీనివల్ల కేతువు కొన్ని రాశులకు అనుకూలంగా మారడం జరుగుతోంది. ఈ రాశుల వారికి జీవితంలో ఆకస్మిక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మిథునం, సింహం, తుల, వృశ్చికం, మీన రాశుల వారు కేతువు కారణంగా బాగా అదృష్టవంతులు కాబోతున్నారు.

మిథునం: ఈ రాశికి తృతీయ స్థానంలో ఉన్న కేతువు దాదాపు రవితో సమానంగా బలం పెరుగుతున్నందు వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు నూరు శాతం ఫలితాలనిస్తాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. జీవితం రాత్రికి రాత్రి మారిపోయిన అనుభూతి కలుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.


సింహం: ఈ రాశిలో ఉన్న కేతువుకు రాశ్యధిపతి రవి బలం కలిగినందువల్ల రాజపూజ్యాలు కలుగుతాయి. ఇంటా బయటా మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం, హోదా పెరుగు తాయి. ప్రముఖులతో పరిచయాలు వృద్ధిచెందుతాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు అందుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి, వారసత్వ సంపదకు అవకాశం ఉంది. అనారోగ్యాల నుంచి బాగా ఉపశమనం లభిస్తుంది.


తుల: ఈ రాశికి లాభ స్థానంలో కేతువుకు రవి బలం కలగడం వల్ల రాజయోగాలు కలుగుతాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభించడం, ప్రముఖులకు సన్నిహితం కావడం, ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించడం, ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడడం, ఆస్తిపాస్తులు లభించడం వంటివి తప్పకుండా జరుగుతాయి. జీవనశైలి పూర్తిగా మారిపోతుంది. సంపన్నుల కోవలో చేరిపోతారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి.


వృశ్చికం: ఈ రాశికి దశమ స్థానంలో ఉన్న కేతువుకు బాగా బలం పెరగడం వల్ల ఉద్యోగంలో తప్పకుండా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ జీవితం బాగా సానుకూలంగా మారిపోతుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఊహించని విధంగా విదేశీ ఆఫర్లు కూడా అందే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలే కాక, స్వయం ఉపాధి, స్టార్టప్పులు కూడా బాగా బిజీగా సాగిపోతాయి.


మీనం: ఈ రాశికి ఆరవ స్థానంలో కేతువు సంచారం వల్ల ఈ రాశివారు అనేక విధాలుగా భాగ్యవంతులు కాబోతున్నారు. సిరి సంపదలు బాగా వృద్ధి చెందుతాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడడం జరుగుతుంది. ఉద్యోగంలో సీనియర్లను కాదని పదోన్నతులు పొందు తారు. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. రాబడి కూడా అంచనాలను మించుతుంది. ఆరోగ్య లాభం కలుగుతుంది. ఏ ప్రయత్నం చేపట్టినా విజయం సాధించడం జరుగుతుంది.

Also Read

Related posts