SGSTV NEWS online
Andhra PradeshCrime

విశాఖలో జ్యోతిష్యుడి దారుణ హత్య



విశాఖపట్నం: విశాఖలో క్షుద్రపూజలు కలకలం రేపాయి.  జ్యోతిష్యుడు దారుణ హత్యకు గురయ్యారు. జ్యోతిష్యుడు అప్పన్న అస్థి పంజరం కాపులుప్పాడలో లభ్యమైంది. మహిళతో అసభ్య ప్రవర్తన నేపథ్యంలో హత్య జరిగినట్టు పోలీసుల అనుమానిస్తున్నారు. ఒక రౌడీ షీటర్, ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలంలో క్షుద్ర పూజలు ఆనవాళ్లు కనిపించాయి. అస్థి పంజరం వద్ద పూసలు, సగం కాలిన ఫోటో, పంచే లభ్యమయ్యాయి.

మరోవైపు, తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. కరీంనగర్ శివారు దుర్శేడ్ గ్రామంలోని పాఠశాలలో క్షుద్ర పూజలు చేశారు. పాఠశాల ఆవరణలో ప్రధానోపాధ్యాయుడి గది ముందు పసుపు, కుంకుమ కుద్రపూజల ఆనవాళ్లు చూసి విద్యార్థులు బెంబేలెత్తారు.

Also read

Related posts