వార ఫలాలు (సెప్టెంబర్ 28-అక్టోబర్ 4, 2025): మేష రాశి వారికి ఈ వారం ఆర్థికపరంగా బాగా కలిసి వచ్చే అవకాశముంది. ఆదాయం బాగా వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. వృషభ రాశి వారు ఆర్థిక విషయాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. కొందరు సన్నిహితుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఆదాయపరంగా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆర్థికపరంగా బాగా కలిసి వచ్చే సమయం ఇది. ఆదాయం బాగా వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృత్తి, ఉద్యోగాలపరంగానే కాకుండా, కుటుంబపరంగా కూడా వారమంతా ప్రశాంతంగా, సానుకూలంగా గడిచిపోతుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. విలాసాలు, వ్యసనాల మీద డబ్బు బాగా ఖర్చయ్యే అవకాశం ఉంది. మంచి మిత్రులు పరిచయం అవుతారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. విహార యాత్రకు ప్లాన్ చేయడం జరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా సాగిపో తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆర్థిక విషయాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. కొందరు సన్నిహితుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో ఆదరణ పెరుగుతుంది. ప్రతిభకు, శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వైద్య ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. పిల్లల నుంచి శుభవార్తలు వినడం జరుగుతుంది. కుటుంబంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొందరు బంధువులు అపనిందలు వేయడం, దుష్ర్పచారం సాగించడం వంటివి జరగవచ్చు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఒకరిద్దరు బంధుమిత్రుల్ని ఆర్థి కంగా ఆదుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆదాయపరంగా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. ప్రతి చిన్న ప్రయత్నం అనుకూల ఫలితాలనిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబానికి సంబంధించిన ఒకటి రెండు సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. దూరపు బంధువుల్లో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. కుటుంబసమేతంగా విహార యాత్రకు ప్లాన్ చేయడం జరుగుతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేషా)
వృత్తి, ఉద్యోగాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో కొద్దిగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, అనుకోని ఖర్చులు మీద పడే సూచనలున్నాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటి వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. డబ్బు గానీ, విలువైన వస్తువులు గానీ పోగొట్టుకునే అవకాశం ఉంది. ఆస్తి వ్యవహారాలు చాలావరకు సవ్యంగా సాగిపోతాయి. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆర్థిక విషయాల్లోనూ, ఆస్తి విషయాల్లోనూ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు తదితర వృత్తుల వారు బాగా బిజీ అవుతారు. మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. నిరుద్యోగులు ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ప్రయాణాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. కుటుంబ పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో ఆశాభంగాలు తప్పకపో వచ్చు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి పరవాలేదనిపిస్తుంది. ఉద్యోగంలో బాగా ఒత్తిడి పెరుగుతుంది. అధికారులు అదనపు బాధ్యతలు అప్పగించడమో, లక్ష్యాలను పెంచడమో జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. అనవసర ఖర్చుల్ని చాలావరకు అదుపు చేస్తారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు. సేవా కార్యక్రమాల్లో గానీ, సహాయ కార్యక్రమాల్లో గానీ పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు, హామీలు ఉండవద్దు. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఆస్తి వివాదం ఒకటి చాలావరకు పరిష్కారమవుతుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
రావలసిన సొమ్ము చేతికి అందడంతో పాటు, షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఉద్యోగానికి సంబంధించి శుభవార్తలు వినడం జరుగుతుంది. ఆదాయం పెరిగి, కొద్దిగా ఆర్థిక బలం పెరుగు తుంది. ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారంలో కలిసి వస్తుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబంలో కొద్దిగా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వాదోపవాదాలకు అవకాశం ఇవ్వవద్దు. ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే సూచనలున్నాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ )
అదనపు ఆదాయ ప్రయత్నాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. కొందరి వల్ల మోస పోవడం లేదా నష్టపోవడం జరుగుతుంది. ఆర్థిక విషయాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు తదితర వృత్తి నిపుణులకు సమయం అనుకూలంగా ఉంది. తలపెట్టిన పనులు చాలావరకు అనుకూలంగా పూర్తవుతాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే ఆదాయానికి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. తోబుట్టువులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. చిన్ననాటి స్నేహితులు కలుస్తారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో చేరే సూచనలు ఉన్నాయి. ఇదివరకు ప్రయత్నం చేసిన పెళ్లి సంబంధం ఇప్పుడు కుదిరే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆదాయం కొద్దిగా పెరిగి ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. కుటుంబ సభ్యులకు సంబంధించి ఆశించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. డబ్బు ఇవ్వాల్సినవారు తీసుకు వచ్చి ఇస్తారు. ఆరోగ్యం విష యంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించడం మంచిది. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి. కార్య కలాపాలు, లావాదేవీలు బాగా వృద్ధి చెందడం వల్ల రాబడి కూడా పెరుగుతుంది. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. మిత్రుల సాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. నిరుద్యోగులు ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. అధికారులు అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉండవచ్చు. కుటుంబానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన బాధ్యతలు పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో ఏమాత్రం తొందరపాటుతో వ్యవహరించవద్దు. బంధుమిత్రులతో కూడా ఆచితూచి వ్యవహరించడం మంచిది. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఆస్తి వివాదం త్వరలో సమసిపోయే అవకాశం ఉంది. పెద్దల జోక్యంతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. అనేక విధాలుగా ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. కొందరు బంధువుల వల్ల కొద్దిగా డబ్బు నష్ట పోయే సూచనలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ అందే అవకాశం ఉంది.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఈ వారంలో చాలావరకు మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది కానీ అనుకోని ఖర్చులు మీద పడే అవకాశం ఉంది. మొత్తం మీద ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అటు ఉద్యోగంలోనూ, ఇటు కుటుంబంలోనూ కొద్దిగా టెన్షన్లు పెరిగే అవకాశం ఉంది. ఓర్పు, సహనాలతో వ్యవహరించడం మంచిది. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల, చేసే ప్రయత్నాల వల్ల మున్ముందు కలిసి వస్తుంది. నిరుద్యోగులు శుభవార్త వినడం జరుగుతుంది. ఆరోగ్యం పరవాలేదు. పెళ్లి ప్రయత్నాల్లో కొద్దిగా ఆశాభంగాలు కలిగే అవకాశం ఉంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆదాయం కొద్దిగా పెరుగుతుంది కానీ అనవసర ఖర్చులు, అనుకోని ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. రావలసిన సొమ్మును పట్టుదలగా రాబట్టుకుంటారు. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. ఉద్యోగ జీవితంలో ఒత్తిడి, శ్రమ పెరిగే అవకాశం ఉంది. అదనపు బాధ్యతల వల్ల సహచరులతో బాధ్యతలు పంచుకోవాల్సి వస్తుంది. అనుకోకుండా కొందరు బంధువులు ఇంటికి రావడం వల్ల ఇబ్బంది పడడం జరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ప్రస్తుతానికి a వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు. అదనపు ఆదాయ ప్రయత్నాల మీద దృష్టి కేంద్రీకరించడం మంచిది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు, అవకాశాలు అందుతాయి.
గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్
Also read
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!
- చనిపోయిన తండ్రిని మరిచిపోలేక.. ఆయన కోసం..
- అయ్యో దేవుడా.. పసివాడి ప్రాణం తీసిన డ్రిల్లింగ్ మెషిన్.. అసలు ఏం జరిగిందంటే?
- హైదరాబాద్లో ముసుగుదొంగల బీభత్సం.. గంటలో ఐదు ఇళ్లలో చోరీ.. షాకింగ్ వీడియో చూస్తే..
- Watch: కోటా వినుత డ్రైవర్ రాయుడు హత్య కేసులో ట్విస్ట్.. వెలుగులోకి సెల్ఫీ వీడియో
- సరస్వతి విగ్రహానికి చున్నీ కప్పి మరీ ప్రభుత్వ పాఠశాలలో నాన్-వెజ్ పార్టీ ..
- ఇంటి దగ్గర వేప చెట్టు ఉంటే ఏమవుతుంది..? ఇంట్లో జరిగే ప్రతి మార్పుకు ఈ చెట్టు పరోక్షంగా కారణమా..!