కర్నూలు : కర్నూలులో టీడీపీ కార్యకర్త తైజుమ్ బాషాపై హత్యాయత్నం కేసులో నలుగురు వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి అనుచరులుగా ఉన్న ఆ పార్టీ కార్యకర్తలు జలీల్, జునైత్, ఫైజల్, ఆరిఫ్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అరెస్ట్ అనంతరం నిందితులను వన్న్ పీఎస్ నుంచి కొండారెడ్డి బురుజు వరకు పోలీసులు నడిపించుకుంటూ తీసుకెళ్లారు.
ఇటీవల తైజుమ్ బాషాపై నిందితులు విచక్షణారహితంగా కర్రలు, రాళ్లతో దాడి చేసి హత్య చేసేందుకు యత్నించారు. బాషా తన ఇంటి నుంచి కిరాణా దుకాణానికి వెళ్లి తిరిగి వస్తుండగా మాటు వేసిన వైకాపా కార్యకర్తలు.. అతడిపై తీవ్రస్థాయిలో దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఉన్న బాషాను కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై కర్నూలు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓట్ల సవరణ కార్యక్రమంలో వైసీపీ తప్పులు కనిపెడుతున్నారని, టీడీపీ లో యాక్టివ్ గా ఉన్నాడనే కారణంతో బాషాపై నిందితులు దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేశారు.
Also read
- ‘నన్ను పెళ్లి చేసుకుంటే జన్మ సార్థకం’.. దొంగ బాబా లీలలు! కట్ చేస్తే చితకబాదిన జనాలు
- కుక్కర్లు అమ్మేవారిలా వచ్చి కోట్ల చోరీలు.. ఆదిలాబాద్లో పట్టుబడ్డ అంతర్జాతీయ దొంగల ముఠా
- ప్లాట్ ఫారం రిక్షా కార్మికులకు “” రిక్షా స్టాండ్”” ఏర్పాటు చెయ్యాలని మంత్రి గారికి వినతిపత్రం…..ఐ.యఫ్.టి.యు.
- బ్రహ్మపుత్ర నదిలో పడి జమ్మలమడుగు యువతి మృతి
- కళ్లల్లో కారం చల్లి… కత్తులతో నరికి… RMP డాక్టర్ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్..!





