పశ్చిమ గోదావరి జిల్లా / పెనుమంట్ర మండలం :
సుప్రసిద్ధ శైవక్షేత్రం జుత్తిగ లోని శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ఆరుద్రోత్సవం జరిగింది. సోమవారం , స్వామివారి జన్మనక్షత్రం కావడంతో, ఈ పుణ్యక్షేత్రంలో స్వామివారి వార్షిక ఆరుద్రోత్సవం కార్యక్రమం వైభవంగా జరిగింది.
అరుద్రోత్సవాన్ని పురస్కరించుకుని…..ఆలయ అర్చకులు రామకృష్ణ శర్మ , ర్యాలీ వాసు శర్మ ఆధ్వర్యం లో వాసుకి రవి సోమేశ్వర స్వామి కి ఏకాదశ రుద్రాభిషేకం , సువర్ణ జలాభిషేకం , నిర్వహించారు. అనంతరం స్వామివారికి అన్నాభిషేకం, విశేష పూజలు చేశారు. శ్రీ పార్వతీ దేవి అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు . ఈ కార్యక్రమం లో మానవహక్కులు సామాజిక న్యాయం వైస్ ప్రెసిడెంట్ , BTB CEO ముద్రగడ. దుర్గా రెడ్డీ , ఆలయ ఈ ఓ. సోమేశ్వరి , తితిదే వెద పండితుడు వేమూరి ఫణీంద్ర శర్మ , దేవాదాయశాఖ అధికారి సాయి ప్రసాద్ , భక్తులు పాల్గొన్నారు.
Also read
- Telangana: పైకేమో బుద్దిమంతుడిలా పోజులు.. లోన చేసేది పోరంబోకు పనులు.. అసలు మ్యాటర్ తెలిస్తే
- ఉపాధికోసమని వెళ్లి చిక్కుల్లో పడ్డ తెలంగాణ కుర్రాడు.. 6 నెలలుగా దుబాయ్‌లోనే..
- Andhra Pradesh: దళిత యువకుడి హత్య కేసు రీ ఓపెన్… వైసీపీ నేత అనంతబాబు చుట్టూ మళ్ళీ ఉచ్చు
- Andhra Pradesh: మాజీ మంత్రి అనిల్ మెడకు మైనింగ్ ఉచ్చు… శ్రీకాంత్ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
- ఆమ్లెట్ మాడిందని భార్యతో గొడవపడ్డ భర్త.. ఆ తర్వాత జరిగిందిదే..