విశాఖలో వివాహిత కిడ్నాప్ చేసేందుకు యత్నించిన రౌడీషీటర్ సహా మరో వ్యక్తిని గంట వ్యవధిలోనే పోలీసులు పట్టుకున్నారు. ప్రధాన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చెపట్టారు.
AP News: విశాఖలో వివాహిత కిడ్నాప్ చేసేందుకు యత్నించిన రౌడీషీటర్ సహా మరో వ్యక్తిని గంట వ్యవధిలోనే పెందుర్తి పోలీసులు పట్టుకున్నారు. ప్రధాన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చెపట్టామని పోలీసులు తెలిపారు. సీఐ సతీష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో పరిచయమున్న వివాహితను అపహరణ చేసేందుకు ప్రయత్నించిన రౌడీషీటర్ సహా మరో యువకుడిని సోమవారం అరెస్టు చేశామన్నారు. పెందుర్తిలోని జేఎన్ఎన్ఎయూ ఆర్ఎం కాలనీకి చెందిన నాగుల మోహన్సాయి (27) ఆటో నడుపుతుంటాడు.
వేప గుంట దరి జేఎన్ఎన్ఎయూఆర్ఎం కాలనీకి చెందిన 24 ఏళ్ల యువతిని గతంలో మోహన్సాయి ప్రేమించాడు. ఇతడి వ్యవహారశైలి బాగోకపోవడంతో అతడిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించింది. అనంతరం విజయనగరానికి చెందిన మరో వ్యక్తిని వివాహం చేసుకుని వెళ్లిపోయింది. ఇటీవల వేపగుంట దరిముత్యమాంబ కాలనీకి చెందిన బంధువులకు అనారోగ్యంగా ఉండడంతో యువతి అక్కడికి వచ్చింది.
ఈ విషయం తెలుసుకున్న మోహన్సాయి సోమవారం ఉదయం ఇద్దరు స్నేహితులతో కలిసి అక్కడకు వెళ్లి ఆమెను తనతో రావాలని గొడవపడ్డాడు. అడొచ్చిన ఆమె చిన్నాన్నపై దాడి చేసి ఆమెను బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని వెళ్లిపోయాడు. చినముషిడివాడ శారదా పీఠం సమీపంలోకి వెళ్లగా యువతి కేకలు వేయడంతో ఆమెను ఆటో నుంచి దించేసి పారిపోయారు. ఆమె జరిగిన విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో మోహన్సాయి, అతడి స్నేహితుడు నందవరపు కుమార్(26)ను అరెస్టు చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు. వివాహిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ కె.వి. సతీష్ కుమార్ తెలిపారు.
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్‌గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..