June 29, 2024
SGSTV NEWS
Andhra Pradesh

AP news: జగన్ కు ఓటెయ్యాలని బెదిరించారు.. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఎన్నికల ముందు అరాచకం

ఎన్నికల ముందు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కొందరు అధికారులు బరితెగించారు. వైద్యులు, నర్సింగ్, పారామెడికల్, నాలుగో తరగతి ఉద్యోగులకు అంతర్గత సమావేశాలు పెట్టి.. జగన్ కు ఓటేయాలని బెదిరించారు.

వైద్యుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు సూపరింటెండెంట్ హెచ్చరికలు గులకరాయి చికిత్స ఘటనలోనూ వైద్యులపై కక్ష సాధింపు గవర్నర్కు సైతం ఫిర్యాదు చేసిన కొంతమంది సిబ్బంది ఆ లేఖ తాజాగా వెలుగులోకి!

Also read :ఇది కదా లక్ అంటే.. చేపల కోసం వల వేసిన జాలరి.. ఎంత లాగినా పైకి రాకపోవడంతో..

అమరావతి- విజయవాడ వైద్యం: ఎన్నికల ముందు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కొందరు అధికారులు బరితెగించారు. వైద్యులు, నర్సింగ్, పారామెడికల్, నాలుగో తరగతి ఉద్యోగులకు అంతర్గత సమావేశాలు పెట్టి.. జగన్కే ఓటేయాలని బెదిరించారు. మళ్లీ వైకాపా ప్రభుత్వమే వస్తోంది, తోక జాడిస్తే మీ పని అయిపోతుందని హెచ్చరించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆధ్వర్యంలోనే ఈ బెదిరింపులు జరిగినట్టు కొందరు ఉద్యోగులు గవర్నర్, ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ లేఖ ఇప్పుడు బయటకు వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి జగన్కు ఎన్నికల ముందు గులకరాయి తగిలి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి రావడంతో వైద్యులు రెండు కుట్లు వేసి, ఓ చిన్న ప్లాస్టర్ అతికించారు. రెండు రోజుల్లో తగ్గిపోతుందని, ఏ ప్రమాదం లేదని చెప్పారు. అదే విషయాన్ని మీడియాకూ వెల్లడించారు. అది క్షమించరాని నేరమన్నట్లుగా సదరు వైద్యులపై ఆ రోజు నుంచి కక్ష సాధింపులు మొదలయ్యాయి. ఇప్పటికీ అదే కొనసాగుతోంది. వీరిలో ఓ సీనియర్ వైద్యుడికి సంబంధించిన గది మరమ్మతుల కోసం సూపరింటెండెంట్కు దరఖాస్తు చేసుకోగా.. దానిని తిరస్కరించి, మీ సొంత డబ్బుతో చేయించుకోండి, ఇదే మీకు శిక్ష అని అందరి ముందే పరుషంగా మాట్లాడి, అవమానించినట్లు తెలిసింది.
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైకాపాకు కొమ్ముకాసే అధికారుల ఆగడాలు, అరాచకాలు, అక్రమాలకు ఇప్పటికీ అడ్డుకట్ట పడలేదు. వాస్తవంగా ఆసుపత్రికి అడిషనల్ డీఎంఈ స్థాయి వైద్యాధికారిని సూపరింటెండెంట్గా నియమించాలి. నిబంధనలు, సీనియారిటీని తుంగలో తొక్కి, జూనియర్ అయిన డాక్టర్ వెంకటేశ్ను తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టారు. రెండేళ్ల కిందట ఆయన బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఆసుపత్రిలో అక్రమాలు, అరాచకాలు, వైకాపాకు వ్యతిరేకంగా ఉండే సిబ్బందిపై వేధింపులు పెరిగిపోయాయి. ప్రభుత్వం మారినా.. ఆసుపత్రిలో ఈ వేధింపులు, వైకాపా అనుకూల అధికారుల ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట పడలేదని సిబ్బంది వాపోతున్నారు.

Also read :టీ తాగేందుకు వచ్చి హోటల్ యజమానికి టోకరా.. రూ. 96 వేలు హాంఫట్

మళ్లీ జగన్ ను గెలిపించాలని..

రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వాసుపత్రుల్లో విజయవాడ ఒకటి. పాత, కొత్త ఆసుపత్రుల్లో కలిపి వైద్యుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు వేల మంది ఉన్నారు. వీరి ఓట్లన్నీ వైకాపాకు వేయించేందుకు సూపరింటెండెంట్
వెంకటేశ్ ఆధ్వర్యంలో ఆసుపత్రిలోని పుష్కర్ హాలులో వరుస సమావేశాలు పెట్టి.. కమిటీలు వేశారు. వీటికి అధ్యక్ష, కార్యదర్శులను నియమించి.. అందరితో వైకాపాకు ఓట్లు వేయించే బాధ్యతలు వారికి అప్పగించారు. సూపరింటెండెంట్ వెంకటేశ్ తమను ఎలా బెదిరించారనేది బాధిత సిబ్బంది గవర్నర్కు రాసిన లేఖలో స్పష్టంగా లేఖలో పేర్కొన్నారు. ‘నేను మరో రెండేళ్లు సూపరింటెండెంట్గానే సర్వీసులో ఉంటాను. మీకు ఏ
పని జరగాలన్నా నామీదే ఆధారపడి ఉంటుందని
మరచిపోకండి. వైకాపా ప్రభుత్వంలో మంత్రి విడదల
రజిని, వైద్యారోగ్య ముఖ్య కార్యదర్శి నాపై నమ్మకంతోనే సూపరింటెండెంట్గా పెట్టారు. నా కంటే సీనియర్లున్నా నన్ను నమ్మి, బాధ్యతలు అప్పగించారు. అందుకే మనమంతా వైకాపాకు అండగా ఉంటామని నేను వారికి మాటిచ్చాను. మనమంతా మాట నిలబెట్టుకోవాలి. మీరు ఎవరికి ఓటేశారో కూడా నాకు తర్వాత తెలుస్తుంది. అందుకే కమిటీలు వేశాను. కడుపులో భయం పెట్టుకుని ప్రవర్తించండి. కచ్చితంగా మళ్లీ జగన్ను అధికారంలోకి తీసుకురావాలి. మళ్లీ అధికారంలోకి రాగానే నాకు పెద్ద పోస్టు ఇస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులందరికీ అండగా ఉంటాను. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయిస్తా. వైద్యులు, ఉద్యోగుల విధులకు సంబంధించి బయోమెట్రిక్ లేకుండా చేస్తా’ అని తమను భయపెట్టి, ప్రలోభపెట్టేలా ఆసుపత్రిలో సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆ లేఖలో ఉద్యోగులు పేర్కొన్నారు. దీనిపై విచారణ చేయించి సూపరింటెండెంట్ రాజ్యాంగబద్ధంగా నడుచుకునేలా చూడాలని.. ఎన్నికలకు ముందు గవర్నర్కు ఉద్యోగులు ఈ లేఖ రాసినట్టు తెలుస్తోంది. సూపరింటెండెంట్ ఉద్యోగులతో సమావేశాలు పెట్టి ఆ ఫొటోలను వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులకు సైతం ఎప్పటికప్పుడు పంపించినట్లు సమాచారం.

విచారణా తూతూమంత్రమే

ఆసుపత్రిలో సూపరింటెండెంట్ తనకు ప్రధాన అనుచరుడైన ఓ ఎంఎనీను షాడోగా పెట్టుకున్నారు. అతనే ఆసుపత్రిలో అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నారు. తన మాటే వినాలంటూ సిబ్బందిని బెదిరించడం, వేధించడం పరిపాటిగా మారింది. పైగా ఆసుపత్రిలో అన్ని వ్యవహారాల్లోనూ వసూళ్ల పర్వం భారీగా కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వానికి అందిన ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్నికల ముందు తూతూమంత్రంగా ఓ విచారణ సైతం చేయించారు. కానీ వీరికి వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారుల ఆశీస్సులుండటంతో.. విచారణాధికారి ఇలా వచ్చి అలా వెళ్లిపోయారని, అంతా బాగానే ఉందని నివేదిక సైతం సమర్పించినట్టు తెలుస్తోంది

Also read :ఎన్టీఆర్ స్టిక్కర్ తొలగించడంపై గొడవ

తల్లిని హతమార్చిన తనయుడు

కుటుంబ సభ్యులందరూ అదే పని! పోలీసుల ఎంట్రీతో స్టోరీ రివర్స్..

రెంటచింతలలో డయేరియా .. ఒకరు మృతి

Related posts

Share via