June 29, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024

AP News : మా వర్గంలోకి రావొద్దు.. ముద్రగడకు షాక్ ఇచ్చిన రెడ్డి సామాజిక వర్గం!



పిఠాపురం రెడ్డి సామాజిక వర్గం ముద్రగడ పద్మనాభ రెడ్డికి భారీ షాక్ ఇచ్చింది. పవన్ గెలిస్తే పేరు మార్చుకుంటానని శపథం చేసిన వ్యక్తి.. మళ్లీ తమ రెడ్డి సామాజిక వర్గంలోకి రావొద్దని డిమాండ్ చేస్తోంది. దీనిపై పత్రిక ప్రకటన విడుదల చేయగా సర్వత్రా చర్చ నడుస్తోంది.


Pithapuram : ముద్రగడ పద్మనాభ రెడ్డి సామాజిక వర్గం షాక్ ఇచ్చింది. పవన్ కల్యాణ్  ను పిఠాపురంలో ఓడించకపోతే పేరు మార్చుకుంటానని శపథం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ మాట నిలబెట్టుకోవాలని సూచించింది. దీంతో పవన్ భారీ మెజార్టీతో గెలవడంతో తానే స్వయంగా మీడియా సమావేశానికి వచ్చి అనుకున్న విధంగానే పేరు మార్చుకుంటున్నానని ముద్రగడ ప్రకటించారు. పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటూ గెజిట్ పబ్లికేషన్ చేస్తున్నట్లు తెలిపారు ముద్రగడ. దీంతో తమ రెడ్డి సామాజిక వర్గంలోకి రావొద్దని అనపర్తి మండలం కొప్పవరం మాజీ సర్పంచ్ కర్రీ వెంకటరామిరెడ్డి అన్నారు.



రెడ్ల పరువు తీయడానికి మళ్లీ వస్తున్నారా?
ముద్రగడ లెటర్ హెడ్ పై పత్రిక ప్రకటన విడుదల చేసిన మాజీ సర్పంచ్ కర్రీ వెంకటరామిరెడ్డి .. ‘అయ్యా పద్మనాభంగారు మీరు రెడ్డి కులంలో చేరటానికి మా రెడ్లు ఎవరైనా మీకు అనుమతి ఇచ్చారా? మా రెడ్డి కులంలోనే ఎందు చేరాలనుకుంటున్నారు? మా రెడ్లు పరువు తీయడానికి మీరు చేరాలనుకుంటున్నారా? ముద్రగడ పద్మనాభం గారు రెడ్లులో చేరాలని ప్రకటించి నాలుగు రోజులు అయినా.. కొత్త ఆంధ్రా రెడ్డి సంఘ సభ్యులు ఎందుకు స్పందించలేదని రెడ్డి సంఘస్తులకు ప్రశ్నిస్తున్నారు. గౌరవంగా బ్రతికే రెడ్లు, నైతిక విలువలు లేకుండా మాట్లాడే వ్యక్తులు మన రెడ్లలో చేరాలనుకుంటే వారిని చేర్చుకోవలసిన అవసరం మనకు ఏమిటి? ఇలాంటి వ్యక్తులను మన రెడ్లకు దూరంగా ఉంచవలసిన అవసరం సంఘ సభ్యులుగా మీకు ఉన్నది. ఇప్పటికైనా సంఘ సభ్యులు ఒక ప్రకటన ద్వారా ఇటువంటి వ్యక్తులను మా రెడ్లలో చేర్చుకోవటం లేదని ఒక ప్రకటన చెయ్యాలి. ముద్రగడ పద్మనాభం గారు రెడ్లులో చేరటాన్ని ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సభ్యుడుగా నేను వ్యతిరేకిస్తున్నా’ అంటూ లేఖలో పేర్రొన్నారు. దీనిపై ప్రస్తుత జిల్లాలో సర్వత్రా చర్చ నడుస్తోంది. ముద్రగడ మళ్లీ ఏ విధంగా స్పందిస్తానేది ఆసక్తికరంగా మారింది.

Also read

Related posts

Share via