ముంబైలో రేప్ అండ్ మర్డర్‌కు గురైన ఏపీ యువతి 2014కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మహారాష్ట్రకు చెందిన నిందితుడు చంద్రభాన్ సుదామ్ సనప్‌ను నిర్ధోషిగా విడుదల చేసింది. సాక్ష్యాలు సరిగాలేనందున కేసు కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది.
ఏపీలోని మచిలీపట్నంకు చెందిన యువతి అత్యాచారం, హత్య కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మహారాష్ట్రకు చెందిన చంద్రభాన్ సుదామ్ సనప్ అనే వ్యక్తి ఆమెను ముంబైలో చంపేయగా అతనికి పదేళ్ల క్రితం (2015) ఉరిశిక్ష పడింది. అయితే ఈ కేసును తాజాగా పరిశీలించిన సుప్రీం కోర్టు చంద్రభాన్‌ను నిర్దోషిగా ప్రకటించింది. బాధితురాలి తరఫున ప్రాసిక్యూషన్ సరై సాక్ష్యాలు చూపించలేకపోవడతో చంద్రభాన్ దోషి కాదని చెబుతూ.. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం 113 పేజీల తీర్పు చెప్పింది.
2015లో చంద్రభాన్‌కు మరణశిక్ష..
ఈ కేసులో ముంబై ట్రయల్ కోర్టు 2015లో చంద్రభాన్‌కు మరణశిక్ష విధించింది. దీంతో ట్రయల్ కోర్టు తీర్పును చంద్రభాన్ సుప్రీం కోర్టులో సవాలు చేశాడు. దీంతో విచారణ జరిపిన ధర్మాసనం సాక్ష్యాధారాలు సంతృప్తికరంగా లేవని తేల్చిచెప్పింది. చంద్రభాన్ లాయర్ ప్రశ్నలకు ప్రాసిక్యూషన్ సమాధానం చెప్పలేకపోవడంతో ప్రాసిక్యూషన్ చెప్పిన అంశాలను తోసిపుచ్చింది. సాక్ష్యాధారాలు సరిగా లేనందున చంద్రభాన్‌పై నేరారోపణలు నిలబడటం సాధ్యం కాదని స్పష్టం చేసింది.
అసలేం జరిగిందంటే..
ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నం యువతి హస్టల్ లో ఉంటూ ముంబైలోని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసేది. అయితే సెలవుపు ఇంటికొచ్చిన ఆమె.. తిరుగుప్రయాణంలో 2014 జనవరి 4న విజయవాడలో లోక్‌మాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్‌లో జవవరి 5న ముంబై చేరుకుంది. తెల్లవారుజామున 5 గంటలకు స్టేషన్ బయట ఉన్న చంద్రభాన్.. ఆమెను అంధేరిలోని హాస్టల్ దగ్గర బైకుపై దింపుతానని, అందుకు రూ.300 ఇవ్వాలని అడగగా ఆమె ఒప్పుకుంది. ఈ క్రమంలోనే మార్గ మధ్యలో నిర్మానుష్య ప్రాంతంలో ఆమెపై అత్యాచారం చేసి దారుణంగా చంపేశాడు. డెడ్ బాడీని కాల్చి హైవే పక్కన పొదల్లో వదిలేశాడు.
ఎలా దొరికాడంటే..
ఇక యువతి తండ్రి ఆమెకు చేరుకుందో లేదో అని తెలుసుకునేందుకు పదే పదే ఫోన్ చేసినా ఎలాంటి స్పందన లేదు. దీంతో కంగారుపడిపోయి వెంటనే విజయవాడ రైల్వే పోలీసులకు విషయం చెప్పాడు. ఆమె కోసం సెర్చింగ్ మొదలుపెట్టిన పోలీసులు ముంబైలోని కుంజూర్ మార్గ్ వద్ద ఆమె డెడ్ బాడి పడివున్నట్లు గుర్తించారు. తల, ప్రైవేట్ పార్ట్ పై గాయాలను గుర్తించి అత్యాచారం చేసి హత్య చేసినట్లు నిర్ధారించారు. దీంతో కేసున సీరియస్ గా తీసుకున్న పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా నిందితుడు చంద్రభాన్ 2014 మార్చి 2న అరెస్టు చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు అతన్ని నిర్ధోషిగా విడుదల చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది
కన్నీరుమున్నీరవుతున్న తండ్రి..
ఈ కేసులో దోషిగా ఉన్న సనప్ సుప్రీంకోర్టుకు వెళ్లిన విషయం తమకు తెలియదని.. కోర్టు నిర్దోషిగా తేల్చిన తర్వాత ఇప్పుడు తాము ఏం చేయాలని మృతురాలు తండ్రి కన్నీరు మున్నీరవుతున్నారు. ఇప్పుడు తన వయసు ఇప్పుడు 70 ఏళ్లు అని.. తన భార్య అనారోగ్యంతో బాధపడుతోందని వాపోతున్నాడు. ఈ ఘటన జరిగి ఇప్పటికే 11 ఏళ్లు గడిచిపోయాయని తెలిపాడు. తమ కూతురు చనిపోయినందుకు ఎంతో కొంత న్యాయం జరిగిందని ఇంతకాలం అనుకున్నామని.. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో అంతా మారిపోయిందని వాపోయాడు
Also read
- వాస్తు శాస్త్రం ప్రకారం రాగి సూర్యుడు ఈ దిశలో ఉంటే మీ అదృష్టం పెరుగుతుంది..!
- Feb 2025 Horoscope: వారికి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం.. 12 రాశుల వారికి మాసఫలాలు
- Crime News: సికింద్రాబాద్‌లో తల్లి శవంతో 8రోజులు.. ఇంట్లో గడిపిన ఇద్దరు కూతుళ్లు
- కోనసీమ తిరుమలలో భక్తుల అవస్థలు.. సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు..
- Guntur District: జనాలకి శఠగోపం పెట్టాలనుకుంటే.. దేవుడే వాళ్లకు పెట్టాడు.. దురాశ దు:ఖానికి చేటు..