July 2, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

ఉద్యోగం పేరిట ఏపీ ఉప ముఖ్యమంత్రి మోసం

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రిలో తన భర్తకు ఎమ్ఎన్ఏ(మేల్ నర్సింగ్ ఆర్డర్లీ) ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మోసం చేశారని ఓ దళిత మహిళ శనివారం ఆరోపించారు.

రూ.4.50 లక్షలు తీసుకుని ముఖం చాటేసిన వైనం కొట్టు సత్యనారాయణపై దళిత మహిళ ఆరోపణ



ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రిలో తన భర్తకు ఎమ్ఎన్(మేల్ నర్సింగ్ ఆర్డర్లీ) ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మోసం చేశారని ఓ దళిత మహిళ శనివారం ఆరోపించారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. గణపవరం ప్రాంతానికి చెందిన ఓగిరాల పరిమళ సుమన అదే గ్రామంలోని పీహెచ్సీ-2లో స్టాఫ్ నర్సుగా విధులు నిర్వహిస్తున్నారు. తాడేపల్లిగూడెం మండలం మిలటరీ మాధవరం గ్రామంలో లైన్మెన్గా పనిచేస్తున్న ఎం. సుదర్శన్, అతని భార్య సుగుణారాణి ఇద్దరూ మంత్రి ద్వారా ఆమె భర్త వీరవెంకట సత్యనారాయణకు గూడెంలోని ఆసుపత్రిలో ఎమ్ఎన్ఏగా ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించారు. దీనికోసం మంత్రికి రూ.4.50 లక్షలు ఇవ్వాలని చెప్పారు. 2020 జనవరిలో మధ్యవర్తుల సహాయంతో నేరుగా అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రిని కలిసి డబ్బులు అందించారు. ఎమ్ఎనీ ఉద్యోగం కాకుండా స్వీపర్ పోస్టు ఇచ్చి.. సంవత్సరం తర్వాత అది కూడా తొలగించారు  ఈ విషయంపై మధ్యవర్తులను ప్రశ్నించగా తమపైనే దాడికి పాల్పడ్డారని బాధితురాలు వాపోయారు. దీనిపై మంత్రి కొట్టు సత్యనారాయణను వివరణ కోరగా.. తాను ఎవరి వద్దా డబ్బులు తీసుకోలేదని స్పష్టం చేశారు.

Also read

Related posts

Share via