విశాఖలో గర్భిణీ అనూష హత్య కేసులో ఏసీపీ సంచలన విషయాలు వెల్లడించారు. జ్ఞానేశ్వర్, అనూష ప్రేమించుకుని 2022లో సింహాచలంలో వివాహం చేసుకున్నారు. అనూషను వదిలించుకోవాలని జ్ఞానేశ్వర్ కొన్నాళ్లుగా చూస్తున్నాడని పోలీసులు విచారణలో తేలింది
AP Crime: విశాఖలో గర్భిణీ అనూషను హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏసీపీ సంచలన విషయాలు వెల్లడించారు. జ్ఞానేశ్వర్, అనూష ప్రేమించుకుని 2022లో సింహాచలంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. నిందితుడు హిందూస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. పోలీసుల విచారణ ప్రకారం.. పీఎం పాలెం పీఎస్ పరిధిలో గర్భిణీ అనూష హత్య ఘటనలో ఏసీపీ అప్పలరాజు సంచలన విషయాలు తెలిపారు. అనూషను వదిలించుకోవాలని జ్ఞానేశ్వర్ కొన్నాళ్లుగా చూస్తున్నాడని పోలీసులు విచారణలో తెలింది. ఈ క్రమంలోనే జ్ఞానేశ్వర్ పలు నాటకాలు ఆడిన్నారు. ముందు తనకు క్యాన్సర్ ఉందని, వేరే పెళ్లి చేసుకోవాలని అనూషపై జ్ఞానేశ్వర్ ఒత్తిడి చేశాడు
గతంలో చంపడానికి ప్లాన్..
ఆమె అంగీకరించకపోవడంతో మరో నాటకం ఆడాడు. తనకు పెళ్లైనట్లు తల్లిదండ్రులకు తెలియదని, వారికి తెలిస్తే ఇద్దరినీ చంపేస్తారని అనూషకు చెప్పాడు. అందుకే.. విడాకులు తీసుకుందామని ఒత్తిడి చేశాడు. ఆ ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో అనూషను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. జ్ఞానేశ్వర్ భార్యను బయటకు తీసుకువెళ్లినా సరదాగా మెలిగేవాడు కాదని, జంటగా ఫొటోలు దిగుదామన్నా వద్దనేవాడు స్నేహితులు చెబుతున్నారు. గతంలో పలుమార్లు చంపడానికి ప్రయత్నించాడు. ఫలుదాలో టాబ్లెట్స్ కలిపి చంపాలని ఫ్లాన్ చేశాడు. జ్ఞానేశ్వర్ డెలివరీ ఉందని ఫ్రెండ్స్ అందరికీ వీడియో కాల్ చేశాడు.
రాత్రికి రాత్రి అనూషను చున్నీతో చంపేశాడు. జ్ఞానేశ్వర్ ముఖంపై గోర్లతో రెక్కేసిన ఆనవాలు ఉన్నట్లు బాధితురాలి స్నేహితులు పోలీసుల విచారణలో తెలిపారు. అయితే.. మంగళవారం డెలివరీ ఉండగా.. సోమవారం రాత్రే ఆమెను హతమార్చాడు. ఏమీ తెలియనట్లు మళ్లీ పడుకున్నాడు. ఉదయం బంధువులు లేపినా.. అనూష లేవలేదు. వారితోపాటే అతనూ నిద్ర లేపుతున్నట్లు నటించాడు. దీంతో జ్ఞానేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నామని.. తనను అనుమానించడంతోనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని ఏసీపీ అప్పలరాజు తెలిపారు. పూర్తి స్థాయి దర్యాప్తు చేసి నిందితుడిపై హత్య నేరం కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
Also read
- ఎంత కష్టమొచ్చిందో.. పురుగుల మందు తాగి అక్క చెల్లెలు …
- Marriages : ముగ్గురు భార్యలు జంప్.. నాలుగో పెళ్లికి రెడీ.. నీ కష్టం పగోడికి కూడా రావొద్దురా!
- ఇంగ్లీష్ టీచర్ వేధిస్తోంది.. మండుటెండలో కేజీబీవీ విద్యార్థినుల ధర్నా
- తాగుబోతు దాష్టీకం.. తాగి గొడవ చేస్తున్నాడని చెప్పినందుకు మహిళపై దారుణం..
- Kuja Dosha Remedies: జాతకంలో కుజ దోషమా.. లక్షణాలు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నివారణలు ఏమిటంటే