విశాఖపట్నం జిల్లా భీమిలీలోని దాకమర్రి ఫార్చ్యూన్ లే ఔట్లో ఓ మహిళను గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ పోసి నిప్పటించి దారుణంగా హత్య చేశారు. మృతురాలి పూర్తి వివరాలు, హత్య వెనుక కారణాలు, నిందితుల గురించి త్వరలో వెల్లడించనున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
AP Crime: విశాఖపట్నం నార్త్ సబ్ డివిజన్లో మరో సంచలన ఘటన జరిగింది. ఇటీవల జరిగిన జ్యోతిష్యుని హత్య ఘటనకు ముగింపు రాకముందే ఇప్పుడు భీమిలీ పోలీస్ స్టేషన్ పరిధిలో మరొక దారుణమైన ఘటన ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. దాక మర్రి ఫార్చ్యూన్ లే ఔట్లో ఒక మహిళను గుర్తు తెలియని దుండగులు పాశవికంగా హతమార్చారు. వివరాల్లోకి వెళితే.. బాధితురాలిపై పెట్రోల్ పోసి నిప్పటించి దారుణంగా హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మృతురాలు 25 సంవత్సరాల వివాహిత అని అధికారులు తెలిపారు. ఘటన జరిగిన స్థలానికి భీమిలీ ఏసీపీ చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
కుటుంబ కలహాలా..?
నార్త్ సబ్ డివిజన్లో ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్న వరుస హత్యలు స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఫోరెన్సిక్ బృందంతో ఆధారాలు సేకరిస్తున్నారు. మృతురాలి పూర్తి వివరాలు, హత్య వెనుక కారణాలు, నిందితుల గురించి త్వరలో వెల్లడించనున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సీసీ టీవీ ఫుటేజ్‌లు, ఫోన్ కాల్ రికార్డులు, మొబైల్ టవర్ల సమాచారం ఆధారంగా విచారణను ముమ్మరం చేశారు. ఈ హత్య వెనుక గల కారణాలు ఇంకా తెలియ రాలేదు. కుటుంబ కలహాలా, లేక మరే ఇతర కోణమా అన్నదానిపై పోలీసులు విచారిస్తున్నారు.
నార్త్ సబ్ డివిజన్ మొత్తం నేరాల కేంద్రంగా మారుతుందా అనే భయం జనాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు ప్రభుత్వం మహిళల భద్రతపై ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్నా, ఇలాంటి హత్యలు పోలీసులపై నమ్మకాన్ని దెబ్బతీయడమే కాదు, మహిళలలో భయాన్ని పెంచుతున్నాయి. భీమిలీ పోలీసులు కేసును అత్యంత సీరియస్‌గా తీసుకుని నిందితులను వెంటనే పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
Also read
- ఈ జన్మలో మీ బాధలకు గత జన్మలోని పాపాలే కాదు.. మరో కారణం ఉంది తెలుసా?
- Jaya Ekadashi: జయ ఏకాదశి ఉపవాసం ఉంటున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయకండి
- Rathasaptami 2026: రథసప్తమి నాడు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ఎలా?.. ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..
- Weekly Horoscope: వారికి ఆర్థికంగా అదృష్టం పట్టే అవకాశం.. 12 రాశుల వారికి వారఫలాలు
- వృద్ధాప్యంలో తిండి పెట్టని కొడుకులు.. ఆస్తి మొత్తం పంచాయతీకి రాసిన తండ్రి! ఎక్కడంటే..





