SGSTV NEWS
Andhra PradeshCrime

AP Crime: ఏపీలో గుండెపగిలే విషాదం.. దేవుని దర్శనం కోసం వచ్చి అనంతలోకాలకు


కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో శనివారం విషాదం చోటు చేసుకుంది. కర్ణాటకలోని హసన్‌కు చెందిన అజిత్ (19), ప్రమోద్ (20), సచిన్ (20) అనే ముగ్గురు యువకులు పుణ్యస్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఏపీలోని కర్నూల్‌ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శ్రీ రాఘవేంద్ర స్వామివారిని దర్శించుకునేందుకు మంత్రాలయం వెళ్లిన 7గురు ఫ్రెండ్స్ ప్రమాదానికి గురయ్యారు. పుణ్యస్నానాలు ఆచరించేందుకు తుంగభద్ర నదిలో దిగగా.. ముగ్గురు ఫ్రెండ్స్ నీటిలో గల్లంతయ్యారు. మరో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఏపీలో గుండెపగిలే విషాదం
వారిది కర్నాటక రాష్ట్రం. హసన్‌లో ఒకే కాలేజీలో డిగ్రీ చదువుతున్న ఏడుగురు యువకులు రెండు రోజులు సెలవులు రావడంతో శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు మంత్రాలయం వచ్చారు. ఇందులో భాగంగానే పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్నారు.

అనంతరం శనివారం సాయంత్రం పుణ్యస్నానాలు ఆచరించేందుకు తుంగభద్ర నదిలోకి దిగారు. ఆ 7గురు స్నేహితులు కలిసి నదిలోపలకి వెళ్లారు. ఈ క్రమంలోనే ఒక స్నేహితుడు కాలు జారి నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. అదే సమయంలో అతడిని పట్టుకోవడానికి మరో ఇద్దరు నీటిలో దిగారు. ఇలా అజిత్ (19), ప్రమోద్ (20), సచిన్ (20) ముగ్గురూ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. మరో నలుగురు ముందుగానే జాగ్రత్తపడి ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయం తెలిసి గల్లంతైన యువకుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.


Also read

Related posts

Share this