తిరుపతి నగరంలో ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని రెండవ అంతస్తు పైనుంచి పడింది. ఈ ఘటన బైరాగపట్టడే పరిధిలో ఉన్న పాఠశాలలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమ్మాయి పడడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Ap crime: తిరుపతి నగరంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థిని భవనం పైనుంచి పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బైరాగపట్టడే పరిధిలో ఉన్న పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలిక. శనివారం మధ్యాహ్నం రెండవ అంతస్తు నుంచి అనుమానాస్పదంగా కిందపడిపోయింది. ఐదవ తరగతి నుంచి ఇదే స్కూల్లో చదువుతున్న బాలిక. మధ్యాహ్నం లంచ్ సమయంలో భోజనం చేసి క్లాస్ రూమ్‌కి వెళ్తుండగా రెండవ అంతస్తు నుంచి కిందపడి పోయింది.
కావాలనే తోశారా..?
వెంటనే గుర్తించిన పాఠశాల యజమాన్యం.. పోలీసులకు సమాచారం అందించింది. అంతేకాకుండా బాలికను హుటాహుటిన ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. యాజమాన్యం అమ్మాయి పడడానికి గల కారణాలపై ఎటువంటి సమాచారం ఇవ్వకపోవటంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూతురు భవనం పైనుంచి కిందపడ్డ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఆడుతూ పాడుతూ చదువుతున్న కూతురు ఇలా ఆస్పత్రి పాలు కావడంతో బోరున విలపిస్తున్నారు.
దీంతో ఆస్పత్రి దగ్గర ఉద్రిక్త వాతావరం నెలకొంది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమ్మాయి పడడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. తోటి విద్యార్థులే తోసేసి ఉంటారన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025