కృష్ణ జిల్లా పెనమలూరులో ఘోర విషాదం చోటుచేసుకుంది. సాయిప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఆర్ధిక ఇబ్బందులతో కొడుకుతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. సైనైడ్ కలిపిన ఐస్ క్రీమ్ తిని బలవన్మరణానికి పాల్పడ్డారు. భర్త కొడుకు చనిపోవడంతో భార్య, కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగారు.
AP Crime: ఆర్థిక ఇబ్బందులతో తండ్రీకొడుకులు ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన కృష్ణాజిల్లా పెనమలూరులో వెలుగుచూసింది. అయితే సాయి ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఏదో వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కాగా, కరోనా తర్వాత ఆయన వ్యాపారం తీవ్రంగా నష్టపోయింది. పలు చోట్ల అప్పులు చేయవల్సి వచ్చింది. దీంతో ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోయాయి. అప్పుల నుంచి బయటపడలేకపోయిన సాయి ప్రకాష్ ఎంతో విషాదకరంగా తనువు చాలించాడు. సైనైడ్ కలిపిన ఐస్ క్రీమ్ తిని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తనతో పాటు కొడుకుకు కూడా అది తినిపించాడు. చనిపోయేముందు కుటుంబ సభ్యులకు సారీ అంటూ మెసేజ్ పంపాడు. భర్త, కొడుకు మరణంతో భార్య లక్ష్మీదేవి, ఇతర కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025