అంబేద్కర్ కోనసీమ జిల్లా బండారులంకలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రేషన్ షాపు నుంచి అక్రమంగా తరలిస్తున్న 50 కేజీలు ఉన్న 40 బస్తాలను అమలాపురం పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. డ్రైవర్‌తోపాటు మరో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
AP Crime: అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం బండారులంకలో నిన్న ప్రారంభమైన రేషన్ షాపులు మరుసటి రోజే వివాదంలో చిక్కుకున్నాయి. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన రేషన్ పంపిణీ వ్యవస్థ అతి తక్కువ కాలంలోనే అక్రమ మార్గాల్లోకి మళ్లడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు బండారులంకలో తెల్లవారుజామున ఓ టాటా ఏసీఈ వాహనాన్ని అడ్డగించి దర్యాప్తు జరిపిన పోలీసులు.. అందులో రేషన్ షాపుల నుంచి అక్రమంగా తరలిస్తున్న 40 బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో బస్తా 50 కేజీల బరువు కలిగి ఉండగా.. వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం:
ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. రేషన్ షాపుల నుంచే బియ్యం తరలిపోతున్నదన్న ఫిర్యాదుతో వెంటనే స్పందించిన పోలీసులు ఈ అక్రమ బియ్యం తరలింపు దందాను నిలిపివేయగలిగారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుండగా.. ఈ బియ్యం ఏ షాప్‌కు చెందినదో గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న నలుగురు వ్యక్తులను పోలీసులు ప్రశ్నిస్తూ, వారి నుంచి సమాచారం రాబట్టే పనిలో ఉన్నారు. రేషన్ బియ్యం తరలింపు చర్యకు సంబంధించి సరైన బిల్స్ ఉన్నాయంటూ అరెస్ట్ అయినవారిలో ఒకరు చెప్పినప్పటికీ.. అవి నిజమైనవా? మాయ డాక్యుమెంట్లా? అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది
ప్రభుత్వం ప్రజలకు అందించాల్సిన నిత్యావసరాల సరఫరాలో ఇటువంటి అక్రమాలు చోటుచేసుకోవడం దురదృష్టకరం. రేషన్ షాపులు పునఃప్రారంభమైన మరుసటి రోజే ఈ రకమైన మాఫియా ఆరంభమవడం, వ్యవస్థలో లోపాలను మరింత వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ సంఘటనపై అధికారులు గట్టిగా స్పందించాలని, అక్రమ రేషన్ మాఫియాను నియంత్రించేందుకు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Also read
- నిజ జీవితంలో ‘నాన్న పులి కథ’.. భర్త కళ్ల ముందే భార్య మృతి. సరిగా ఉరివేసుకో అనడంతో..
- తీవ్ర విషాదం.. భర్త మీద కోపంతో.. ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకేసిన మహిళ..!
- బామ్మర్ది పెళ్లి.. బావ బలవన్మరణం
- ఉద్యోగం వస్తే ఇలా చేయాల్నా.. భర్తను కేసులతో హింసించిన భార్య.. పాపం చివరకు
- ఇద్దరు ప్రియురాళ్లను తీసుకుని వెళ్లి, దావత్ చేసుకున్న ప్రియుడు.. ఇంతలోనే షాకింగ్ ఘటన..!





