అమ్మా ఐ యామ్ వెరీ సారీ..ఇక నీ కొడుకు లేడమ్మా..జాగ్రత్తగా ఉండు..మళ్లీ వస్తాను..చెల్లి మానస కడుపున పుడతాను. నాకోసం మీరు ఉండాలి. నాన్నకు చెప్పు..ప్లీజ్ మా…ఐ మిస్ యూ మా… లవ్ యూ మా…అంటూ తల్లికి వీడియో కాల్ చేసి ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
AP Crime : తల్లి కన్నీళ్లకైనా..నీ మనసు కరగకపోయెనా..అమ్మ వెళ్లి.. వస్తానని అమ్మకే చెప్తావా..అమ్మ గుండె ఎంతగా తల్లడిల్లిందో..ఒక్కసారైనా ఆలోచిస్తివా తల్లి కన్నీళ్లకైనా..నీ మనసు కరగకపోయెనా..చేతులెత్తి వేడుకున్నా.. వినకపోతివా..ఐ లవ్ యూ.. అమ్మా.. అంటూ ప్రాణం తీసుకుంటావా.. ఇంతకన్నాశిక్ష ఏముంటుంది కన్నా అంటూ ఆ తల్లి రోదిస్తు్న్న తీరు అక్కడి వారందరినీ కలచివేసింది. తల్లికి వీడియో కాల్ చేసి మరీ ఊరివేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది
అమ్మా ఐ యామ్ వెరీ సారీ.. ఇక నీ కొడుకు లేడమ్మా.. జాగ్రత్తగా ఉండు.. మళ్లీ వస్తాను.. చెల్లి మానస కడుపున పుడతాను. నాకోసం మీరు ఉండాలి. నాన్నకు చెప్పు.. ప్లీజ్ మా… ఐ మిస్ యూ మా… లవ్ యూ మా… అంటూ తల్లికి వాట్సాప్ మెసేజ్ చేశాడు. ఆ తర్వాత వీడియో కాల్ చేసి, వద్దని వేడుకుంటున్నా.. కళ్ల నీళ్లు పెట్టుకుంటున్నా వినకుండా.. తల్లి చూస్తుండగానే ఉరేసుకుని, మరణించాడు. కొడుకు మరణాన్ని చూసి తల్లి కుప్పకూలిపోయింది. అనంతపురం జిల్లా నార్పల మండలంలోని బొమ్మలాటపల్లి వద్ద బ్రహంగారి గుడి వెనుక గుట్టపై ఉన్న చెట్టుకు ఉరేసుకుని మల్లికార్జున (23) మరణించాడు. నార్పల మండల పులసనూతల గ్రామానికి చెందిన ఆదినారాయణ, మునీశ్వరి దంపతుల ఒక్కగానొక్క కుమారుడు మల్లికార్జున. ఇంటర్ వరకు చది వాడు. అనంతపురంలో కారు డ్రైవింగ్ నేర్చుకుంటుండేవాడు. తాను చనిపో తున్నానని శుక్రవారం తల్లిదండ్రులకు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపాడు. అనంతరం తల్లి మునీశ్వరికి వీడియో కాల్ చేసి లైవ్లోనే చెట్టుకు ఉరేసు కుని, చనిపోతున్నానన్నాడు. తల్లి మునీశ్వరి కన్నీరు మున్నీరుగా విలపించింది. ‘చనిపోవద్దు.. నాన్నా..’ అని ప్రాధేయపడినా వినకుండా ఉరేసుకున్నాడు. దీంతో మునీశ్వరి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
వెంటనే కుటుంబీకులు.. నార్పల పోలీసులకు సమాచారం అందించారు. ఇంతలోనే చెట్టుకు వేలాడుతున్న యువకుడి మృతదేహాన్ని అటుగా వెళ్తున్న వారు గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. నార్పల పోలీసుల సమాచారంతో మృతదేహం మల్లికార్జునదిగా గుర్తించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. దీనిపై బుక్కరాయసముద్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!