ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు తిరునాళ్లలో పెను విషాదం జరిగింది. సరదాగా ఎగ్జిబిషన్ లో జెయింట్ వీల్ ఎక్కిన సాయి కుమార్ అనే యువ సాఫ్ట్‌వేర్ తొట్టి విరిగి కిందపడడంతో చనిపోయాడు. దీంతో అతని స్వగ్రామం వేమవరంలో విషాదం అలుముకుంది
ఎన్టీఆర్ జిల్లాలో దారుణ విషాద ఘటన జరిగింది. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ చిన తిరునాళ్ల ఎగ్జిబిషన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. జెయింట్ వీల్ తొట్టి ఊడిపడి వత్సవాయి మండలం కొత్త వేమవరంనకు చెందిన యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గింజుపల్లి సాయికుమార్ ప్రాణాలు కోల్పోయారు
ఈ ఘటనలో సాయికుమార్ సోదరుడు గింజుపల్లి గోపిచంద్‌కు తీవ్రగాయాలు కావడంతో విజయవాడ ఆస్పత్రికి తరలించారు. సాయికుమార్, గోపిచంద్ మంగళవారం ఎగ్జిబిషన్‌కు వచ్చి జెయింట్ వీల్ ఎక్కారు. ఇంతలో వారిద్దరు కూర్చున్న బకెట్ ఊడి పడింది
Software Engineer Death Incident
ఈ ఘటనలో సాయికుమార్ పక్కనే ఉన్న సిమెంట్ రోడ్డుపై పడిపోయారు.దీంతో సాయికుమార్ తల రోడ్డుకు బలంగా తగలడంతో ఘటనా స్థలంలోనే చనిపోయాడు. అతడి సోదరుడు గోపిచంద్ నేలపై పడటంతో కాలు, చేయి విరగడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో అతడిని వెంటనే అతడ్ని 108 వాహనంలో స్థానిక పీహెచ్‌సీకి తరలించి అక్కడి నుంచి విజయవాడ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు, ఆలయ అధికారులు అక్కడికి చేరుకొని ఎగ్జిబిషన్‌ను నిలిపివేశారు.
సాయికుమార్ తల్లిదండ్రులు శ్రీనివాసరావు, లక్ష్మీ వ్యవసాయం చేస్తుంటారు. ఇద్దరు కుమారుల్ని ఇంజనీరింగ్ చదివించారు. సాయికుమార్‌కు 2 నెలల క్రితమే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం వచ్చింది. హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేస్తున్నారు. సాయికుమార్ సోదరుడు గోపీచంద్ బీటెక్ చదువుతున్నాడు. సాయికుమార్ ఐటీ ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు
ఇంతలోనే సాయికుమార్‌ను జెయింట్ వీల్ తొట్టి రూపంలో మృత్యువు వెంటాడింది. కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్న పెద్ద కుమారుడి మరణంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో ఉన్నారు. ఎగ్జిబిషన్ దగ్గర సాయికుమార్ చనిపోయాడని తెలియగానే వేమవరానికి చెందిన స్థానికులు అక్కడికి తరలివచ్చారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ మృతదేహంతో పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళన చేశారు.
Also read
- Auspicious Yogas: ఈ నెల 21న అరుదైన యోగాలు.. దీర్ఘాయువు, ఆయుస్సు కోసం ఎలా పుజించాలంటే..
- Brahma Muhurta: బ్రహ్మ ముహూర్తంలో మేల్కొంటే ఎన్ని లాభాలో తెలుసా . . ఏ పనులను శుభప్రదం అంటే..?
- నేటి జాతకములు..19 జూలై, 2025
- Visakhapatnam Kidney Racket: అందమైన సాగరతీరంలో కిడ్నీ రాకెట్ కలకలం..! విచారణలో విస్తుబోయే వాస్తవాలు..
- Andhra News: ఉద్యోగం వదిలి వచ్చి పెళ్లైన వ్యక్తితో కూతురు ప్రేమాయణం.. తల్లిదండ్రులు ఏం చేశారంటే!