తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం నిడిగట్ల గ్రామ శివారులో దారుణం చోటు చేసుకుంది. కాసులు అనే యువకున్ని అతని స్నేహితులే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. కాగా ఘటన ఆలస్యంగా వెలుగు చూడడంతో మృతదేహం కుళ్లిన స్థితిలో లభించింది.
AP Crime: తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం నిడిగట్ల గ్రామ శివారులో దారుణం చోటు చేసుకుంది. కాసులు అనే యువకున్ని అతని స్నేహితులే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. కాగా ఘటన ఆలస్యంగా వెలుగు చూడడంతో మృతదేహం కుళ్లిన స్థితిలో లభించింది. మృతుడు వెంకట నగరం గ్రామానికి చెందిన చిన్నబ్బులు (కాసులు ) గా పోలీసులు గుర్తించారు. ఇటీవల తన స్నేహితులతో కలిసి వెళ్లిన కాసులు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
కాగా కాసులు (చిన్నబ్బులు) తన స్నేహితులతో కలిసి మందు పార్టీ చేసుకున్నారని పోలీసులు తెలిపారు. మద్యం సేవించే సమయంలో వారి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో వారితో కాసులు ఘర్షణ పడ్డాడు. వారిని చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఏప్పటికైనా వాడితో ప్రమాదం ఉంటుందని భావించిన స్నేహితులు హత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తు లో తేలింది. గ్రామశివారులోని నిర్మానుశ్య ప్రాంతానికి తీసుకెళ్లిన వారు బండ రాయితో మోది చంపేసినట్లు తెలుస్తోంది. అయితే అటువైపు ఎవరూ వెళ్లకపోవడంతో మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో దొరికింది. కాగా ఈ ఘటనలో అనుమానం ఉన్న ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. మరికొంతమంది కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025