ఏపీ సీఎం జగన్ త్వరలోనే బ్రిటన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాలకు వెళ్లనున్నారు. ఈ మేరకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఆయన హైదరాబాదులోని సీబీఐ కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు.
అక్రమాస్తుల అభియోగాల నేపథ్యంలో సీఎం జగన్ పై అనేక సీబీఐ కేసులు ఉండడం తెలిసిందే. ప్రస్తుతం ఆయన షరతులతో కూడిన బెయిల్ పై బయట ఉన్నారు. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని కోర్టు బెయిల్ షరతుల్లో పేర్కొంది.
ఈ నేపథ్యంలో, తాను విదేశాలకు వెళ్లేందుకు వీలుగా బెయిల్ నిబంధనలు సడలించాలని సీబీఐ కోర్టును కోరారు. సీఎం జగన్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన నాంపల్లి సీబీఐ న్యాయస్థానం… కౌంటర్ దాఖలు చేయాలంటూ సీబీఐని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
కాగా, ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్యన తాను విదేశాలకు వెళ్లాల్సి ఉందని సీఎం జగన్ తన దరఖాస్తులో పేర్కొన్నారు.
Also read
- నేటి జాతకములు..15 అక్టోబర్, 2025
- Karthika Masam 2025: కార్తీక మాసంలో.. నదీ స్నానం చేయడం వెనక ఆంతర్యం ఏమిటి ?
- Kubera Temple: మన దేశంలో కుబేరుడికీ గుడి ఉందని తెలుసా.. ఒక్కసారి దర్శించుకున్నా.. జీవితంలో డబ్బుకి ఇబ్బందే ఉండదు..
- TG News: తెలంగాణలో లక్షల కొద్ది కిడ్నీ, క్యాన్సర్ కేసులు.. వణుకు పుట్టిస్తున్న ఆరోగ్యశాఖ లేటెస్ట్ లెక్కలు!!
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!