April 3, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

AP: ఆంధ్రాలో మరో సామూహిక అత్యాచారం..మైనర్ ను మూడు రోజులు నిర్భంధించి…


ఆంధ్రప్రదేశ్ లో బయటపడ్డ మరో సామూహిక అత్యాచారం ఘటన కలకలం రేపుతోంది. గన్నవరంలో మైనర్ బాలికను మూడు రోజుల పాటూ నిర్బంధించి రేప్ చేశారు. దీంట్లో పాల్గొన్న ఎనిమిది మంది పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దేశ వ్యాప్తంగా అత్యాచార ఘటనలు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. అందులోనూ సామూహిక అత్యాచారాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఎక్కడ ఎవరు ఏం చేస్తారో తెలియక తల్లిదండ్రులు తమ పిల్లలను బయటకు పంపించడానికే భయపడుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరంలో ఇలాంటి ఘటన మరొకటి వెలుగు చూసింది. గన్నవరం మండలం వీరపనేని గూడెంలో ఈనెల 9వ తేదీన స్నేహితురాలి ఇంటి నుండి రాత్రి సమయంలో బయటకు వచ్చిన మైనర్ బాలిక అదృశ్యమైంది. కొంతమంది యువకులు కలిసి ఆ అమ్మాయిని ఎత్తుకెళ్లారు. వీరపనేని గూడెం శివారు ప్రాంతంలో మూడు రోజుల పాటూ నిర్బంధించి రేప్ చేశారు.

మూడు రోజుల తర్వాత..
మూడు రోజుల తర్వాత మైనర్ బాలికను విడిచిపెట్టేసిన నిందితులు..తనను ఆటో ఎక్కించి పంపించేశారు. ఆ తర్వాత ఆటో డ్రైవర్ సహాయంతో బాలిక విజయవాడ పోలీసులను ఆశ్రయించింది. తనపై జరిగిన అఘాత్యాన్ని  చెప్పింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు…దానిని ఆత్కూరు పోలీస్ స్టేషన్‌కు పంపించారు. ఆత్కూరు పోలీసులు సీసీ టీవీ ఫుటేజి ఆధారంగా నిందితులను గుర్తించి…అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఎనిమిది మంది యువకులు అత్యాచారానికి పాల్పడ్డట్టు తెలుసుకున్నారు. నిందితుల్లో ఒకరు పదతరగతి పరీక్షలు రాసినట్టుగా కూడా గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం నిందితులు అందరూ పోలీసుల కస్టడీలో ఉన్నారు

Also read

Related posts

Share via